English | Telugu

'అంకుల్' అని పిలుస్తూ బాడీ షేమింగ్ చేస్తున్నారా!?

నిన్నటి వరకు ట్విట్టర్ లో 'ఆంటీ' వివాదం రచ్చ చేసింది. ఇప్పుడు కొత్తగా 'అంకుల్' వివాదం తెర మీదకు వచ్చింది. దీనికి కారణం నటుడు బ్రహ్మాజీ. ఆయన ఇటీవల ఒక వెరైటీ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "వాట్స్ హాపెనింగ్ " అంటూ ఒక క్వశ్చన్ కూడా రిలేటెడ్ గా పెట్టారు. దీంతో ఒక నెటిజన్ "ఏం లేదు అంకుల్" అంటూ రిప్లై ఇచ్చాడు. అసలే బ్రహ్మాజీకి కోపం చాలా తక్కువ. కానీ ఈ రిప్లైకి కొంచెం కోపం వచ్చినట్టే ఉంది.

"అంకుల్ ఏంట్రా అంకుల్... కేసు వేస్తా.. నా ఏజ్ ని, నన్ను చూసి బాడీ షేమింగ్ చేస్తున్నావా?" అంటూ సెటైర్ వేసాడు. అలాగే ఆ కామెంట్ పక్కన ఒక స్మైల్‌ ఎమోజి పెట్టేసరికి ఇది సరదాగా పెట్టిన పోస్ట్ అని అర్థమౌతోంది. ఇటీవల అనసూయని ఆంటీ అన్నందుకు కేసు పెట్టింది. ఆ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.

ఐతే ఆమెను ఆంటీ అన్నందుకు మాత్రమే కేసు వేయలేదు అన్నా!! ఆంటీ అంటూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినందుకు కేసు వేస్తానని అన్నారు..! తోటి కళాకారులకు సహకారం ఇవ్వకుండా కామెడీ చేయడం ఏంటి బ్రహ్మాజీ అన్నా మీరు!!? అంటూ మిగతా నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదిక మీద"అలాగే మా తాతగారు బ్రహ్మాజీ" గారు అన్న డైలాగ్ ని పోస్ట్ చేశారు. ఆంటీ వివాదమే ఇంకా చల్లారలేదు, ఇప్పుడు కొత్త‌గా అంకుల్ అన్నందుకు బ్రహ్మాజీ ఫైర్ అవుతున్నారు. ఈ అంకుల్ మాట ఎంతో దూరం వెళ్తుందో వేచి చూడాలి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.