English | Telugu

య‌శోధ‌ర్ - వేద‌ల ఎంగేజ్‌మెంట్ ఆగుతుందా?  

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, ఆనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్ త‌దితరులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. యశోధ‌ర్ - వేద‌ల నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. అందంగా ముస్తాబైన వేద స్టేజ్ పైకి వ‌చ్చేస్తుంది. పురోహితులు మంత్రాలు చ‌ద‌వ‌డం కూడా అయిపోతుంది. కానీ య‌శోధ‌ర్ మాత్రం రాక‌పోవ‌డంతో నానా ర‌కాలుగా వ‌చ్చిన అతిథులు మాట్లాడుకోవ‌డం మొద‌ల‌వుతుంది.

వేద కూడా య‌శోధ‌ర్‌ని అనుమానించ‌డం మొద‌లు పెడుతుంది. ఇదంతా గ‌మ‌నించిన వేద త‌ల్లి సులోచ‌న .. య‌ష్ త‌ల్లి మాలినిపై కోపంతో అరుస్తుంది. మీ వ‌ల్లే మా కుటుంబం ప‌రువుపోయింద‌ని, న‌మ్మించి ఇంత దాకా తీసుకొచ్చి నా బిడ్డ‌ని మోసం చేశారంటూ మాలిని కుటుంబంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. అయితే ఎక్క‌డో పొర‌పాటు జ‌రిగింద‌ని, య‌ష్ అలాంటి వాడు కాద‌ని మాలిని, ర‌త్నం స‌ర్దిచెబుతుంటారు. మ‌రో వైపు `మిస్ట‌ర్ య‌శోధ‌ర్ నువ్వు ఇంత క‌సాయివాడివి అని అనుకోలేద‌ని కోపంగా స్టేజ్ పై నుంచి దిగి య‌శోధ‌ర్ ఆఫీస్ కి వెళ‌తానంటూ బ‌య‌లుదేరుతుంది..

వేద బావ ఆవేశం వ‌ద్దు ఆలోచ‌న‌తో నిర్ణ‌యాలు తీసుకోమంటాడు. బ‌ల‌మైన కార‌ణం లేనిదే ఇలా జ‌రిగి వుండ‌ద‌ని, య‌ష్ ని త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నావంటాడు. క‌ట్ చేస్తే వేద పెళ్లి ఎవ‌రితో జ‌ర‌గ‌బోతోందా? అని ఆరా తీయ‌డానికి వ‌చ్చిన మాళ‌విక వేద‌తో త‌న బావ చ‌నువుగా వుండ‌టాన్ని చూసి త‌నే వేద‌ని పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి అని భ్ర‌మ‌ప‌డుతుంది. క‌ట్ చేస్తే.. య‌ష్ త‌న కూతురు ఖుషీ కోసం అభిమ‌న్యు ఇంటికి వెళ‌తాడు.. అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. ఖుషీ కోసం చివ‌రికి య‌ష్ ... అభిమ‌న్యు కాళ్లు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.. కానీ ఫ‌లితం లేక‌పోవ‌డంతో అక్క‌డి నుంచి బాధ‌ప‌డుతూ మండ‌పానికి చేరుకుంటాడు. య‌ష్ ని చూసి ర‌గిలిపోయిన వేద ఏం చేసింది? .. ఇద్ద‌రి మ‌ధ్య పెరిగిన దూరం ఎలా త‌గ్గింది?.. ఇంత‌కీ య‌ష్‌, వేద‌ల ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.