English | Telugu

కరాటే కళ్యాణి చుట్టూ ఏం జరుగుతోంది?

క‌రాటే కళ్యాణి ... 'బాబీ' అంటూ బ్ర‌హ్మీతో కామెడీని పండించిన ఈ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్ లోనూ న‌టిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల `మా` ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో హేమ‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వార్త‌ల్లో నిలిచిన క‌రాటే క‌ల్యాణీ గ‌త కొంత కాలంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇరుక్కుంటున్నారు అన‌డం కంటే వివాదాల చుట్టే తిరుగుతున్నారు.

వివాదం ఎక్క‌డుంటే క‌రాటే క‌ల్యాణి అక్క‌డ వుంటోంది అన్న‌ట్టుగా మారింది అమె వ్య‌వ‌హార‌శైలి. తాజాగా ఆమె శివ‌శ‌క్తి ట్ర‌స్ట్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స‌ద‌రు ట్ర‌స్ట్ నిర్వాహ‌కులు కోటి రూపాయ‌ల మేర‌కు నిధులను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని క‌ల్యాణి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. హిందువుల‌ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ శివ‌శ‌క్తి ట్ర‌స్ట్ స‌భ్యులు నిధులు సేక‌రిస్తున్నార‌ని, అప్ప‌టికే సేక‌రించిన మొత్తంలో కోటి మాయం చేశారని క‌ల్యాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read:సంక్రాంతికి 'హీరో'గా వ‌స్తోన్న అశోక్ గ‌ల్లా

దీంతో స‌ద‌రు ట్రిస్ట్ నుంచి త‌న‌కు బెదిరింపులు మొద‌ల‌య్యాయిని, త‌న‌ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నార‌ని ఆమె ఆరోప‌ణ‌లు చేస్తోంది. త‌న‌కు శివ‌శ‌క్తి ట్ర‌స్ట్ స‌భ్యుల నుంచి ప్రాణ హాని వుంద‌ని తాజాగా బంజారాహిల్స్ పోలీసుల‌కు క‌రాటే క‌ల్యాణి ఫిర్యాదు చేశారు. ట్ర‌స్ట్ చేసే త‌ప్పుడు ప‌నులు బ‌య‌ట‌పెడుతున్న త‌న‌ని హ‌త్య చేయాల‌ని చూస్తున్నార‌ని క‌ల్యాణి ఫిర్యాదు చేసింది. గ‌తంలోనూ క‌ల్యాణి ఓ మైన‌ర్ బాలిక హ‌త్య ఉదంతం కేసులోనూ వివాదంలో చిక్కుకుని ఆ త‌రువాత బ‌య‌ట‌ప‌డింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.