English | Telugu

"గెటౌట్ ఆఫ్ మై స్టూడియో" అంటూ కిషోర్ పై అరిచిన గెటప్ శీను

అశోకవనంలో అర్జునకల్యాణం మూవీ టైంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో యాంకర్ దేవికి, విశ్వక్ సేన్ కి మధ్య ఎంత పెద్ద వార్ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీకి సంబంధించి చేసిన ప్రాంక్ వీడియో విషయంపై ఆ న్యూస్ ఛానల్ లో హాట్ హాట్ గా జరిగిన డిబేట్ మాత్రం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. తర్వాత ఈ టాపిక్ మీద జబర్దస్త్ స్కిట్స్ కూడా మస్త్ పేలాయి. ఐతే తాజాగా గెటప్ శీను ఈ కాంట్రవర్సీ టాపిక్ మీద ఒక వీడియో చేసి వార్తల్లో నిలిచాడు. హ్యాపీ బర్త్డే అనే మూవీ జులై 8 న రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇందులో నటించిన వారితో ఒక స్కిట్ చేసాడు. న్యూసెన్స్ అనే టీవీ లోగో పెట్టి అందులో న్యూస్ రీడర్ గా గెటప్ శీను దేవి నాగవల్లి అవతారమెత్తుతాడు. ఇక ఈ మూవీలో నటించిన కమెడియన్ అని చెప్పుకు తిరుగుతున్న సత్య గారు మన స్టూడియోలో ఉన్నారు అంటాడు శీను. చెప్పు కాదండి షూ వేసుకొచ్చానని సత్య కామెడీ చేస్తాడు. వెంటనే పక్కనే వున్న వాటర్ బాటిల్ సత్య మీదకు విసిరేసి ఇలాంటి డైలాగులు బయటవేసుకోండి లేదా మీ సినిమాలో పెట్టుకోండి అంటూ సీరియస్ అవుతాడు.

ఇక మూవీ హీరో నరేష్ అగస్త్య స్టూడియోకి వస్తారు. ఫైనల్ గా లైవ్ లో వెన్నెల కిషోర్ జాయిన్ అవుతారు. ఇక ఈ ముగ్గురు ఎన్ని సినిమాలు తీశారు. ఎన్ని ఆడాయి అంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ఈ మూవీలో హీరో ఎవరు అంటూ అరుచుకుంటూ ఉంటారు. ఏంటయ్యా ఈ చెత్త డిబేట్లు అంటూ ఫైర్ అవుతాడు వెన్నెల కిషోర్. అరె పిల్ల బచ్చాస్ ఏ ఈవెంట్ లో ఐనా హీరో లాస్ట్ లో మాట్లాడతాడు అంటాడు. ఇక ఈ షోలో బినామీ క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తి స్టూడియోలోకి వచ్చేసి సత్యతో హడావిడి చేస్తూ ఉంటాడు. గెటప్ శీను అతన్ని చూసి చాలా ఇరిటేట్ అవుతాడు. ఏం చేయాలో అర్థంకాక టైం స్లాట్ ఐపోయింది నెక్స్ట్ డిబేట్ లో చూద్దాం అంటాడు. అక్కడి గొడవ చూసి వెన్నెల కిషోర్ బుల్ షిట్ అంటాడు. వెంటనే గెటప్ శీను సీరియస్ ఐపోయి గెట్ అవుట్ అంటూ అరుస్తాడు.

వెంటనే కిషోర్ బయట చల్లగా ఉందండి అంటూ కామెడీ చేసేసరికి గెటౌట్ ఆఫ్ మై స్టూడియో అంటూ పిచ్చి పట్టినట్టు అరుస్తాడు శీను. నేను స్టూడియోలో లేనండి బాబు క్యారవాన్ లో ఉన్నాను అంటాడు కిషోర్. ఐనాసరే గెటౌట్ అంటాడు శీను. మీలో ఎవరు హీరో అనే స్కిట్ చివరికి గొడవగొడవగా మారి శీను స్టూడియోలోంచి లేచి వెళ్ళిపోతాడు మరో డిబేట్ లో కలుద్దామంటూ. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.