English | Telugu

'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వ‌నిత‌!

వివాదాస్ప‌ద‌ త‌మిళ న‌టి వ‌నితా విజ‌య్‌కుమార్ బిగ్ బాస్ అల్టిమేట్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆ షోకు సంబంధించి మోస్ట్ ప్రామిసింగ్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా భావించిన ఆమె హ‌ఠాత్తుగా బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. హాట్‌స్టార్ రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో తాను షో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని అనుకుంటున్న‌ట్లు క‌న్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది వ‌నిత‌. అంత‌కు ముందు క‌న్ఫెష‌న్ రూమ్ డోర్స్ తెర‌వ‌మ‌ని బిగ్ బాస్‌ను గ‌ట్టిగా అరుస్తూ క‌నిపించిందామె. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక‌పోయిన ఆమె బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని డిసైడ్ చేసుకుంది.

మ‌న‌సులో అనుకున్న‌దే బ‌య‌ట‌కు చెప్పే మ‌నిషిగా వ‌నిత పేరు తెచ్చుకుంది. ఇది బిగ్ బాస్ త‌మిళ్ షోలో పాల్గొన్న‌ప్పుడు తోటి కంటెస్టెంట్లు వ‌నిత‌ది డామినేటింగ్ క్యారెక్ట‌ర్ అనీ, ఇత‌రుల‌కు ఆర్డ‌ర్లు వేస్తుంటుంద‌నీ చెప్పారు. అయితే త‌న‌లోనూ సున్నిత‌మైన హృద‌యం ఉంద‌ని ఓ సంద‌ర్భంలో ఆమె తెలియ‌జేసింది కూడా.

ప్ర‌స్తుతం వ‌నిత బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ అయిన బిగ్ బాస్ అల్టిమేట్ కంటెస్టెంట్ల‌లో ఒక‌రుగా ఉన్నారు. ఏంజెల్స్ అండ్ డెమ‌న్స్ అనే టాస్క్ సంద‌ర్భంగా వ‌నిత తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యింది. అప్పుడే క‌న్ఫెష‌న్ రూమ్ డోర్స్ తెర‌వ‌మ‌ని బిగ్ బాస్‌ని అడిగింది. లోప‌ల‌కు ర‌మ్మ‌న‌మ‌ని పిలిచిన‌ప్పుడు, ఆ టాస్క్‌పై ఫిర్యాదు చేసిన ఆమె, ఆ షో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు తెలిపింది. త‌న మాన‌సిక‌, శారీర‌క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు చెప్పింది వ‌నిత‌. ఆమె నిర్ణ‌యం ఫైన‌లేనా అని బిగ్ బాస్ మ‌రోసారి అడ‌గ‌గా, అవునంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది.

బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్‌లో తొలి సీజ‌న్‌గా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ అల్టిమేట్ రోజుకు 24 గంట‌ల పాటు ప్ర‌సార‌మ‌వుతోంది. మొద‌ట ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్‌గా లోకేశ్ క‌న‌క‌రాజ్ డైరెక్ట్ చేస్తోన్న‌ 'విక్ర‌మ్' మూవీ షూటింగ్ నిమిత్తం ఆ షో నుంచి త‌ప్పుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన బిగ్ బాస్ త‌మిళ 5 సీజ‌న్ల నుంచి 14 మంది కంటెస్టెంట్ల‌ను ఎంచుకొని, వారితో బిగ్ బాస్ అల్టిమేట్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ షోకు కొత్త హోస్ట్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో తేలుతుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.