English | Telugu

య‌ష్ - వేద‌ల పెళ్లిని ఆప‌డానికి అభిమ‌న్యు - మాళ‌విక ఏం చేశారు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ గురువారం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిర‌గ‌బోతోంది. ఈ రోజు హైలెట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. వేద వేసుకున్న మేక‌ప్‌, డ్రెస్సింగ్ చూసి ఖుషీ కోస‌మే పెళ్లి అన్నావ్‌.. ఇప్పుడు ఇలా రెడీ అవుతున్నావ్ అంటూ య‌శోధ‌ర్ కామెంట్ చేస్తాడు. ఆట‌ప‌ట్టించ‌డం కోసం మాలిని కూల్ డ్రింక్‌ లో మందు క‌లిపి వేద ఫ్యామిలీని తాగ‌మంటుంది. వేద త‌ల్లి సులోచ‌న అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో తాను హ‌ర్ట్ అయ్యాన‌ని డ్రామా మొద‌లుపెడుతుంది మాలిని. దాంతో వేద ఫ్యామిలీ తాగాల్సి వ‌స్తుంది.

Also Read:'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వ‌నిత‌!

ఇక సంగీత్ చిత్ర‌, వ‌సంత్ ల డ్యాన్స్ తో మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే వేదని గిఫ్ట్ తో ప‌డేయాలని మాళవిక నెక్లెస్ తీసుకుని వేద సంగీత్ ఫంక్ష‌న్ కి బ‌య‌లుదేరుతుంది. ఫంక్ష‌న్ హాల్ కి చేరుకున్న మాళ‌విక కంగారులో కార్ లాక్ తో పాటు నెక్లెస్ బాక్స్ తీసుకోవ‌డం మ‌ర్చిపోతుంది. ఈ లోగా కార్ లాక్ అవుతుంది. సెక్యూరిటీతో చెప్పి కార్ డోర్ లాక్ తీయించిన మాళ‌విక వేద కోసం తీసుకొచ్చిన నెక్లెస్ బాక్స్ తీసుకుని ఫంక్ష‌న్ హాల్ లోకి ప్ర‌వేశిస్తుంది. అప్ప‌టికే య‌శోధ‌ర్ వీర‌బిల్డ‌ప్ ఇస్తూ డ్యాన్స్ నేనే అద‌ర‌గొట్టాన‌ని వేద ముందు పోజు కొడుతుంటాడు.

Also Read:సంగీత్‌లో య‌ష్ - వేద అడ్డంగా దొరికిపోయారా?

ఆ బిల్డ‌ప్ లు చూసి వేద మ‌రీ ఎక్కువైంది అంటూ క‌ళ్ల‌తోనే చెప్పేస్తుంది. ఆ త‌రువాత ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేస్తుండ‌గా ఇంత‌లో సంగీత్ ఫంక్ష‌న్ లోకి మాళ‌విక ఎంట్రీ ఇస్తుంది. య‌ష్ పెళ్లి చేసుకోబోయేది వేద‌నే అని తెలుసుకుని షాక్ అవుతుంది. వెంట‌నే ఆ విష‌యాన్ని అభిమ‌న్యుకి చెబుతుంది. ఆ త‌రువాత య‌ష్ - వేద‌ల పెళ్లిని ఆప‌డానికి అభిమ‌న్యు - మాళ‌విక ఏం చేశారు? .. అందుకు ప్ర‌తిగా య‌ష్ ఎలాంటి ప్లాన్ వేశాడన్న‌ది ఈ రోజు చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.