English | Telugu

బెట్టింగ్ యాప్స్ ని ఇక ప్రమోట్ చేయను.. సారీ...

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వాటిని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్లను పోలీసులు ఊరుకోవడం లేదు. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఇష్యూ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇలాంటి టైములో సురేఖ వాని కూతురు సుప్రీతా హోలీ రోజున హోలీ కలర్స్ ఒళ్ళంతా పులుముకుని ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

"కొంతమంది ఇన్‌ఫ్లుయన్సర్స్‌ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అందులో నేను ఒకదాన్ని. కానీ ఇప్పుడు ప్రమోట్ చేయడం ఆపేసాను. ప్రమోట్ చేసినందుకు సారీ. ఎవరైనా ఇన్‌ఫ్లుయన్సర్స్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు మీరు చూసినా వాటికి అట్రాక్ట్ కావొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి. ఇంకా వాళ్ళను ఫాలో కూడా అవ్వొద్దు. అందరికీ థాంక్యూ అండ్ ఒన్స్ అగైన్ సారీ" అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే ఈ వీడియోని వి.సి. సజ్జనార్ కి కూడా ట్యాగ్ చేసింది.

తెలంగాణా ఆర్టీసీ ఎండి, ఐపిఎస్ సజ్జనార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద బాగా ఫోకస్ చేశారు. ఈ మధ్య కాలంలో ఎన్నో కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ వలన సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది కూడా బెట్టింగ్ యాప్స్ వలన అంటూ వీడియోస్ చేసి మరీ మరణిస్తున్నారు. దాంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు సే నో టు బెట్టింగ్ అనే హ్యాష్ టాగ్ బాగా సర్క్యులేట్ అవుతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.