English | Telugu

రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొట్టిన సౌంద‌ర్య‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని నెల‌లుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క ఇళ్లు వ‌దిలి, ఊరు వ‌దిలి తాడికొండ గ్రామం చేరిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఈ జంట‌కు రుద్రాణి రూపంలో క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అయితే అలాంటి రుద్రాణికి ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో అదిరిపోయే షాక్ అగిలింది. ఏంట‌ది.. సౌంద‌ర్య ఎలా ఎంట‌రైంది? అన్న‌ది ఒక సారి చూద్దాం.

ఈ రోజు 1252వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. రుద్రాణి త‌న మ‌నుషుల‌తో `రేయ్ రిజిస్ట్రేష‌న్ కి టైమ్ అవుతోంది.. బ‌య‌లుదేర‌దాం ప‌దండి` అంటుంది. అబ్బులు కారు తీస్తాడు. డ్రైవ్ చేస్తూ అక్క‌డా ప‌క్క ఆశ్ర‌మంలో మా ఆవిడ‌కు మందులు తీసుకోవాలి అక్కా ప్లీట్ .. వెంట‌నే వస్తాను` అంటాడు. స‌రే అంటుంది రుద్రాణి. దాంతో కారు ఆశ్ర‌మం ముందు ఆగుతుంది. లోప‌లికి వెళ్లిన అబ్బులు సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌తో క‌లిసి ధ్యానంలో వున్న గురువుని మందులు ఇవ్వ‌మ‌ని విసిగిస్తుంటాడు. సౌంద‌ర్యకు కోపం వ‌చ్చేస్తుంది. దాంతో అబ్బులుపై అరుస్తుంది.

ఇంత‌లో రుద్రాణిలోనికి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్ర‌మంలో రుద్రాణి, సౌంద‌ర్య మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది. అయితే ఈ క్ర‌మంలోనే మాట మాట పెరిగి రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొడుతుంది సౌంద‌ర్య. దీంతో షాక్ కు గురైన రుద్రాణి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఈ విష‌యం ఊళ్లో తెలియ‌డంతో రుద్రాణి చెంప ప‌గుల గొట్టింది ఎవ‌రా చూసి పోదామ‌ని దీప ఆశ్ర‌మానికి వ‌స్తుంది. అక్క‌డ త‌ను ఎవ‌రిని చూసింది? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.