English | Telugu
సాయికిరణ్‌ను దేవుడనుకున్న తాగుబోతు!
Updated : Jun 17, 2022
టాలీవుడ్ లో సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్స్ చేస్తూ మంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిన సాయి కిరణ్ మనందరికీ తెలుసు. 2000లో విడుదలైన మూవీ 'నువ్వే కావాలి'లో "అనగనగా ఆకాశం ఉంది" అనే పాటతో మంచి పాపులర్ అయ్యాడు సాయికిరణ్. ప్రకాష్ పాత్రలో సెకండ్ హీరోగా చేసినా గుర్తుండిపోయే రోల్ లో నటించాడు. ఈ సాయికిరణ్ గాయకుడు రామకృష్ణ కుమారుడు అన్న విషయం కూడా అందరికి తెలుసు. ఐతే ఆయన 'నువ్వే కావాలి' సక్సెస్ ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. తర్వాత చేసిన మూవీస్ ఫ్లాప్ అయ్యేసరికి తెరమరుగయ్యాడు.
'నువ్వే కావాలి' తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు' వంటి మూవీస్ లో యాక్ట్ చేశాడు సాయికిరణ్. ఆ తర్వాత మంచి ఆఫర్స్ రాకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. జగపతి, షిర్డీసాయి, నక్షత్రం, గోపి గోడ మీద పిల్లి మూవీస్ లో నటించాడు. బిగ్ స్క్రీన్ మీద అనుకున్న స్థాయిలో క్లిక్ అవకపోయేసరికి స్మాల్ స్క్రీన్ మీద దృష్టి పెట్టి 'కోయిలమ్మ' సీరియల్ లో నటించి పర్వాలేదనిపించాడు.
'కోయిలమ్మ' సీరియల్ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ లో మహేంద్ర రోల్ లో నటిస్తున్న సాయికిరణ్ మనందరికీ తెలుసు. అలాంటి సాయికిరణ్ కి ఇటీవల నరసింహ స్వామి ఆలయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎదురయ్యింది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. తానుఆలయానికి వెళ్ళినప్పుడు మద్యం మైకంలో ఉన్న ఒక వ్యక్తి సాయికిరణ్ ని చూసి, అతనే నిజమైన దేవుడిగా భావించి ప్రపంచంలోని సమస్యలు పరిష్కరించాలంటూ "రా దిగిరా" అంటూ డిమాండ్ చేసాడు. సాయికిరణ్ కూడా అతన్ని ఏమీ అనలేక సైలెంట్గా అతన్ని దీవించేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
బుల్లితెర సెలబ్రిటీస్ చాలామంది ఈ వీడియోకి కామెంట్స్ చేశారు. ఐతే నెటిజన్స్ మాత్రం మీరు నిజంగా నరసింహస్వామి లానే కనిపిస్తున్నారు. మీ ముఖంలో ఆ ఆధ్యాత్మిక భావన అనేది కనిపిస్తుంది కాబట్టే అతనికి మీరు దేవుడిలా కనిపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.