English | Telugu

టికెట్ టూ ఫినాలే కంటెండర్ గా రోహిణి.. బ్లాక్ స్టార్ ఎవరికి వచ్చిందంటే!

ఈ వారం హౌస్ లో టికెట్ టు ఫినాలే సందడి నడుస్తుంది. అందుకు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడు లేని విధంగా మాజీ కంటెస్టెంట్స్ వచ్చి టికెట్ టు ఫినాలే టాస్క్ లు కండక్ట్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ సార్థక్, హారికలు బిగ్ బాస్ లోకి ఎంట్రీకి ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్ ని ఈ థీమ్ తో ఆడించాలని సెలక్ట్ చేసుకొమ్మని చెప్తాడు.

అందులో భాగంగా ఇద్దరు కలిసి స్పీడ్ బ్యాలెన్సింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తమని ఇంప్రెస్ చేసిన వారికి టాస్క్ ఆడే ఛాన్స్ ఇస్తారు. అందులో గౌతమ్ ని రోహిణి సెలక్ట్ చేసుకోగా వాళ్ళిద్దరు మరొక ఇద్దరిని బిగ్ బాస్ సెలక్ట్ చేసుకోమని చెప్తాడు. వాళ్లే విష్ణుప్రియ, తేజలు. ఇక మొదటి టాస్క్ స్పీడ్ లో బిగ్ బాస్ చెప్పిన కరెక్ట్ ఆర్డర్ తో ఒక వంతెన కట్టాలి. అందులో రోహిణి ఫస్ట్ గెలుస్తుంది. సెకండ్ గౌతమ్.. ఆ తర్వాత విష్ణుప్రియ, తేజ ఇద్దరు నిలిచారు. ఇక సెకెండ్ టాస్క్ బ్యాలెన్సింగ్ లో ఒక త్రాస్ లో బాక్స్ లతో రెండు ఈక్వల్ గా చెయ్యాలి. అందులో మొదట టాస్క్ గెలిచినందుకు రోహిణి కి బెన్ఫిట్ గా ఎనిమిది బాక్స్ లు తీసుకుంటుంది. గౌతమ్ ఆరు బాక్స్ లు తీసుకుంటాడు. విష్ణుప్రియకి నాలుగు, తేజకి రెండు బాక్స్ లు వస్తాయి. అఖిల్ హారికలకి ఒక పవర్ ఉంటుంది. దాంతో తేజకి రెండు బాక్స్ లు ఇస్తాడు.

ఆ తర్వాత మిగతా బాక్స్ లు బజర్ మ్రోగాక ఎవరైతే ఫాస్ట్ గా తీసుకొని వచ్చి.. బ్యాలెన్సింగ్ చేస్తారో వాళ్ళు విన్ అందులో మొదటగా రోహిణి గెలుస్తుంది. ఆ తర్వాత గౌతమ్ గెలుస్తాడు. ఇక టికెట్ టు ఫినాలే మొదటి కంటెండర్ గా రోహిణి కి బ్యాడ్జ్ ఇవ్వగా.. ఇక టికెట్ టు ఫినాలే రేస్ నుండి ఎవరని తప్పిస్తారో వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వాలని బిగ్ బాస్ అఖిల్, హారిక లకి చెప్పగా... ఓవరాల్ పర్ఫామెన్స్ చూసి ఇద్దరు కలిసి విష్ణుకి ఇస్తారు. దాంతో విష్ణుప్రియ ఏడుస్తుంది. ఇక తను టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకుంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.