English | Telugu

నా ఇమేజ్ కి బిగ్ బాస్ కరెక్ట్ కాదబ్బా

బిగ్ బాస్ న్యూ సీజన్ రావడానికి ఇంకెంతో టైం లేదు. ఐతే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇది అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ లో ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంద్రనీల్ మాత్రం తాను ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లడం లేదంటూ ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసాడు. తాను బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యానని, ఇంటర్వ్యూలకు కూడా వెళ్లానని చెప్పాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వెళ్ళాను అనే విషయం బల్లగుద్ది చెప్పేసాడు. "నన్ను అభిమానించే ఫ్యాన్స్‌కి చెప్పేది ఏంటంటే..నేను బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లడం లేదు.

ఎప్పటినుంచో ఈ మాట చెప్పాలని అనుకుంటున్నా. నాకు బిగ్ బాస్ టీమ్ కాల్ చేసినప్పుడు ఇదే మాట చెప్పా. నాకు ఇంట్రస్ట్‌ లేదని చెప్పాను. అప్పుడు నా భార్య మేఘన నా పక్కనే ఉంది. కనీసం ఒక్క ఇంటర్వ్యూకి అయినా రండి అన్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. సరేనని ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడ వాళ్లు చాలా ప్రశ్నలు అడిగారు. అవి నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. నాకు తెలిసిన సమాధానాలు చెప్పేసి వచ్చాను. రెండు వారాల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు పిలిచారు. ఈసారి ముంబయి టీం వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. బిగ్ బాస్ అప్ కమింగ్ ఆర్టిస్ట్‌లకు హెల్ప్ అవుతుంది. నాలాంటి వాళ్లకి మాత్రం కాదు. నా ఇమేజ్‌కి బిగ్ బాస్ కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లిన తరువాత గొడవలు ఉంటాయి. నామినేషన్స్ సమయంలో అగ్రెసివ్ గా ఉండాలి. ఫైట్స్ ఉంటాయి. ఇవన్నీ ఊహించుకున్న తర్వాత బిగ్ బాస్‌కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చేశాడు ఇంద్రనీల్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.