English | Telugu
విష్ణుప్రియతో మానస్ ఆటాపాటా
Updated : Aug 16, 2022
మానస్ నాగులపల్లి ఇప్పుడు బుల్లి తెర మీద ఫేమస్ యాక్టర్. సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, వీడియో అయినా అభిమానులను అలరించే అవకాశాన్ని మానస్ నాగులపల్లి అస్సలు వదులుకోడు. అలాంటి మానస్ త్వరలో విష్ణుప్రియతో కలిసి అలరించబోతున్నాడు. 'జరీ జరీ' అనే జానపద వీడియో సాంగ్ లో కనిపించబోతున్నాడు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్, జడ్జి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే తన లుక్‌ను మానస్ రిలీజ్ చేసాడు. కొన్ని స్పెషల్ టీవీ షోస్ లో కీర్తి కేశవ్ భట్‌తో కలిసి మానస్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్సులు అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా మానస్ మాత్రం డాన్స్ చేసే అవకాశాన్ని అస్సలు వదులుకోడు.
ఇక ఇప్పుడు మానస్, విష్ణుప్రియ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ఆడియన్స్ లో అంచనాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక మానస్ కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే తాను నటించిన వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే బాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మానస్.