English | Telugu
కీర్తి భట్ వర్సెస్ ఇనయా!
Updated : Oct 11, 2022
బిగ్ బాస్ లో రోజు రోజుకి వినోదంతో పాటు, సస్పెన్స్ ఉత్కంఠభరితంగా సాగుతూ వస్తోంది. అయితే నామినేషన్లో ఒక్కొక్కరుగా వచ్చి తమ నామినేషన్ ని తెలిపారు. ఇనయ, కీర్తి భట్ ని నామినేట్ చేసింది. అలా చేసాక ఒక మినీ యుద్ధం జరిగినట్టుగా అనిపించింది.
నామినేషన్లో మొదటగా రేవంత్, సుదీపని నామినేట్ చేసాడు. ఆ తర్వాత కారణం చెప్పగా, అది సుదీపకి కరెక్ట్ అనిపించలేదు. "ఏమీ లేని దానికి నామినేట్ చేసావ్" అని సుదీప చెప్పగా, "మీకు తెలిసి చేసారు కానీ ఆలోచించి చేయలేదు" అని రేవంత్ చెప్పుకొచ్చాడు. "నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు అనవసరంగా నన్ను నామినేట్ చేసావ్" అని సుదీప సమాధానమిచ్చింది. ఆ తర్వాత కీర్తి భట్ ని ఇనయా నామినేట్ చేసింది. "చంటి గారు సెల్ఫ్ నామినేట్ అయ్యారు. నీ వల్ల రెండు రోజులుగా ఫుడ్ కూడా తినలేదు. చంటి గారు నామినేట్ అయ్యి బయటకు పోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నువ్వు" అని ఇనయా చెప్పగా, "సెల్ఫ్ నామినేట్ చేసుకోమని నేను చెప్పలేదు" అని కీర్తి భట్ సమాధానమిచ్చింది. తర్వాత కీర్తి భట్ మట్లాడుతూ "నేను కెప్టెన్ గా సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించకపోతే నాకు నాగార్జున గారు ఎనభై మార్కులు ఇవ్వడు" అని అనగా ఇరవై తగ్గింది కదా అని ఇనయ చెప్పింది. దీంతో కీర్తి భట్ చాలా గర్వంగా నడుస్తూ "అరె పో ఎనభై కన్నా ఒక్క మార్కు ఎక్కువ తెచ్చుకో చాలు నువ్వు గొప్ప" అని చెప్పింది. ఇనయాని కించపరుస్తూ మాట్లాడినట్టుగా అనిపించింది.
ఏదైనా ఆటలో 'సేమ్ టూ సేమ్ ఆటిట్యూడ్' ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ తలపడితే ఎలా ఉంటుందో అలా ఉంది కీర్తి భట్, ఇనయా ఇద్దరు గొడవ. ఈ గొడవ గురించి వీరిద్దరిపై, నాగార్జున చాలా గట్టిగానే సీరియస్ అవుతాడేమోనని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హౌస్ లో వీళ్ళిద్దరు కలిసి టాస్క్ లు ఆడతారో? లేదో? చూడాల్సి ఉంది.