English | Telugu

‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు'.. క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

'ఆలీతో సరదాగా' షోకి ఈ వారం సెలెబ్రిటీగా అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అలీ కూడా ఒక కాంట్రవర్సీ ప్రశ్న వేశారు. "అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కాస్త డిస్టర్బెన్స్ వచ్చిందని ప్రజలు చెవులు కొరుక్కుంటారు" అని అలీ అడిగేసరికిఅల్లు అరవింద్ కూడా ఆ విషయం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

"అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము బావబామ్మర్దులం కాక ముందు నుంచి అంటే 80వ దశకం నుంచి మంచి ఫ్రెండ్స్. ఇది పోటీ ప్రపంచం. ఇక్కడ పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలి. లేదంటే మనం వెనకబడిపోతూ ఉంటాం. ఇదొక చిన్న ఫిలిం సొసైటీ. కాబట్టి ఈ పోటీని తట్టుకుంటూ ఎవరికీ వారుగా పైకి వెళ్తున్నాం. ఐతే ఇలా ఎవరికి వారుగా ఎదుగుతూ ఉండేసరికి సహజంగా గొడవలు అంటూ రూమర్స్ రావడం సహజం. అని ఆయ‌న చెప్పారు.

"కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మాకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఏం జరిగినా మేమంతా ఒక్కటే.. ఒక్క మాట మీదే నిలబడతాం అని అర్ధం చేసుకోవాలి. ప్రతీ పండగకి మా ఇంట్లో పూజ అవీ చేసేసుకున్నాక అందరం చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం. మేం కలిసే వున్నాం అని చెప్పడానికి ప్రతీ ఇన్సిడెంట్ ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయలేము కదా.. మాలో ఎవ్వరి మీద ఒక్క మాట పడినా కూడా మేమంతా ఒక్కటైపోతాం. ఇందులో నో డౌట్" అంటూ క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.