English | Telugu
చిత్రగారికి టేప్ రికార్డర్, కోయిల, రాక్షసి, ఏనుగు అనే నిక్ నేమ్స్ వెనక స్టోరీ తెలుసా ?
Updated : Aug 1, 2025
పాడుతా తీయగా ఈ వారం షోలో సింగర్స్ చిత్రా గారి పాటలు పాడి ఆడియన్స్ ని అలరించారు. ఈ సందర్భంగా చిత్రా గారితో ఉన్న అనుబంధం ఆనాటి జ్ఞాపకాల గురించి విషయాలను గురించి కీరవాణి మధ్యమధ్యలో ఉటంకిస్తూ ఉన్నారు. అలాగే ఆమెకు పెట్టిన నిక్ నేమ్స్ గురించి కూడా చెప్పారు. " నేను ఎలుగుబంటిని ఐతే చిత్రా గారు ఎవరు అనేది నేను చెప్తాను. నేను అందరికీ నిక్ నేమ్స్ ఉంటాయి...చిత్ర గారికి నేను చాలా నిక్ నేమ్స్ పెట్టాను. నాకు మనుషులు దగ్గరయ్యే కొద్దీ నిక్ నేమ్స్ పెరుగుతూ ఉంటాయి. నా కెరీర్ లో 90 పర్సెంట్ సాంగ్స్ చిత్ర గారే పాడారు. ఆవిడతో నా జర్నీ 35 ఏళ్ళు. చిత్ర గారి నిక్ నేమ్స్ చెప్తాను. మా గురువు గారు రాజమణి గారు ఒక నిక్ నేమ్ పెట్టారు. టేప్ రికార్డర్ వచ్చింది. ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే ఆమె చెప్పింది చెప్పినట్టు బైహార్ట్ చేస్తారు. ఆమెకు ధారణ శక్తి కూడా ఎక్కువ. కరెక్షన్స్ కి అవకాశం లేకుండా పడేస్తారు. అందుకే ఆమెను టేప్ రికార్డర్ అనేవాళ్ళు. నేను ఆమెను కోయిల అని పిలుస్తాను.
అలాగే ఆమెకు రాక్షసి అనే నిక్ నేమ్ పెట్టాను. అంటే మనుషులకు సాధ్యం కానీ పనులను చేసే వాళ్ళను రాక్షసులు లేదా దేవతలు అంటారు. రజో గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళను రాక్షసులు అంటారు. అలాగే ఆమెను ఏనుగు అని కూడా పిలుస్తూ ఉంటాను. తెలుగులో ఒక సామెత ఉంది నిలబడిన గుర్రం కంటే పడిపోయిన ఏనుగు ఎక్కువ హైట్ ఉంటుంది. అంటే ఆవిడ పాడడానికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అపస్వరాలు ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి పాడతాను అనేవారు కానీ నాకు చాలా బాగా నచ్చేది. ఎక్కువ కరెక్షన్స్ చేసినా అది యాంత్రికంగా ఉంటుంది అని ఆమె సాంగ్ ని ఫస్ట్ టేక్ లోనే ఓకే చేసేవాడిని. ఎందుకు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తున్నారు అంటూ నన్ను అడిగేవారు. అప్పుడు నేను ఆమెకు ఈ సామెతను చెప్పాను. మీరు ఎలా పాడినా మామూలు సింగర్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేవాడిని. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె ఆకారంలో ఏనుగును అనడం స్టార్ట్ చేశారు. నేను పట్టించుకోవడం మానేసాను." అంటూ చెప్పుకొచ్చారు కీరవాణి.