English | Telugu
షబీనా లవ్ స్టోరీ ఇదా..?
Updated : Sep 3, 2022
జబర్దస్త్ షోలో షబీనా నాటీ నరేష్ తో చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉంది షబీనా. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కొద్ది రోజులు నటించింది. ఐతే కస్తూరి సీరియల్ షబీనాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యింది షబీనా. ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆమె ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న లవర్ సలీంతో షోస్ లో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూకి కూడా ఇద్దరూ కలిసే వచ్చారు. అక్కడ అసలు తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పుకొచ్చింది. "షబీనా మీ సేవలో జాబ్ చేసేటప్పుడు అక్కడికి సలీం అలియాస్ మున్నా వచ్చేవాడట. అలా ఓ సారి నాతో మాట్లాడుతూ.. మీరు నాకు తెలుసు.. మీ నంబర్ నా దగ్గర ఉంది అంటూ మాటలు కలిపాడని చెప్పింది. ఐతే ఇప్పటికీ ఆ నంబర్ మున్నాకు ఎలా దొరికిందో తెలీదు అంది షబీనా. నెంబర్ ఎలా తెలుసుకున్నావ్ అంటూ సలీంని అడిగేసరికి ఆమె మీ సేవలో బిజీగా ఉన్న టైములో ఓ సారి ఆమె ఫోన్ తీసుకుని నా నంబర్‌కు డయల్ చేశా..
ఆమె ఫోన్‌లో మళ్లీ వెంటనే నా నంబర్ డిలీట్ చేశాను. అలా నెంబర్ సంపాదించా. ఇంకా ఈ ఫోన్ నెంబర్ విషయం మీద మూడు నెలలు మాట్లాడుకున్నాం..నేను కూడా ఇదే జరిగి ఉంటుందని అనుకున్నా అంటూ షబినా కూడా చెప్పుకొచ్చింది. అలా మాట్లాడుకుంటున్న టైములో మేం ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నాం. తర్వాత ఇళ్లల్లో వాళ్లకు చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం" అని చెప్పారు.