English | Telugu

రష్మీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది...లక్కీ భాస్కర్ కావడానికి ఫైమాకి ప్లాస్టిక్ సర్జరీ


ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోస్ లో యాంకర్ రష్మీ మీద జోక్స్ , కౌంటర్లు వేయడం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. నెక్స్ట్ వీక్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. అందులో చూస్తే రెండు స్కిట్స్ లో రష్మీ పేరును బాగా వాడేశారు. బులెట్ భాస్కర్ స్కిట్ లో ఐతే నాటీ నరేష్ వచ్చి పేరు చెప్పి డీటెయిల్స్ నోట్ చేసుకున్నాడు. లక్ష రూపాయలు కడిగితే కోటి రూపాయలు వస్తుంది అని చెప్పేసరికి ఫైమా డీటెయిల్స్ ఇచ్చాడు బులెట్ భాస్కర్.

ఎలాగైనా ఆ కోటి రూపాయలు కొట్టేసి లక్కీ భాస్కర్ ఐపోవాలని ప్లాన్ చేసి ఫైమాకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాడు. ఆ ప్లాస్టిక్ సర్జరీలో ఏకంగా ఫైమా బదులు సత్య వచ్చేస్తుంది. "ఇదేంటి సర్ నా భార్య ఎక్కడ...ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే ఇంత మార్పు వస్తుందా" అని అడిగాడు. "ఈమెనే నీ భార్య..ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత మార్పు వస్తుంది" అని డాక్టర్ చెప్పేసరికి "రష్మీ ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు ఎన్ని చేయించుకుందో ఏమిటో" అని భాస్కర్ కౌంటర్ వేసాడు. దానికి రష్మీ షాకైపోతుంది. "సి థిస్ గర్ల్...నంబర్ వన్ మేకప్ గర్ల్ " అంటూ వెనక ఒక డైలాగ్ కూడా వచ్చేసింది. ఇక ప్రోమో స్టార్టింగ్ లో దొరబాబు స్కిట్ లో కూడా రష్మీ పేరొచ్చింది. దొరబాబు పెళ్ళికొడుకు గెటప్ లో ఉంటాడు. ఆటో రాంప్రసాద్ దొరబాబును అడుగుతాడు " పెళ్లి కూతురు ఎలా ఉంటుంది" అని " అటు ఇటుగా రష్మిలా ఉంటుంది" అంటాడు దొరబాబు. "అటైతే ఓకే కానీ ఇటు రష్మిలా ఉంటే ఎందుకు బొక్కా" అంటూ కౌంటర్ వేసాడు ఆటో రాంప్రసాద్.