English | Telugu

తులసి అందరినీ హిప్నోటైజ్ చేసి తనవైపు లాక్కుంటోంది అన్న లాస్య

తులసి వాళ్ళ ఫామిలీ హ్యాపీగా ఉన్న టైంలో అభి ఇంటికి వచ్చి తల్లిని పట్టుకుని నానా మాటలు అంటాడు. అసలు తానూ తన తల్లే కాదని ఫైర్ అవుతాడు. అభి వాళ్ళ నానమ్మ తాతయ్య అభిని తిడతారు. ఐనా ఊరుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసింది తల్లే అంటూ ఇంకా ఎప్పుడు ఆ ఇంటి గుమ్మం తొక్కను అంటాడు. తల్లితో యుద్ధం ఇక్కడినుంచే స్టార్ట్ అయ్యిందని ఛాలెంజ్ చేస్తాడు. అభి మాటలకూ అందరూ షాక్ అవుతారు. అక్కడినుంచి నాన్న నందు దగ్గరకు వెళ్లి కోపంతో తులసిని తిడుతూ ఉంటాడు. లాస్య కూడా నాలుగు మాటలు కలిపి నూరి అభితో తిట్టిస్తుంది.

తాను బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి నీకు ఆస్తి వస్తే నేను తీసేసుకుంటానేమో అని భయపడి తులసి ఆస్తి నీ పేరు మీద రాయనివ్వకుండా అడ్డుపడిందేమో అని నందు అభితో అంటాడు. ఏదైమైనా నేను అంకిత దగ్గరకు వెళ్లి ఆస్తి తీసుకొస్తాను మీరు బిజినెస్ పెట్టండి డాడ్ అంటూ వెళ్ళిపోతాడు. మరో వైపు ప్రేమ్ అవకాశాల కోసం ముప్పీలహరి దగ్గర పని చేసాను అని చెప్పిన ఎవరూ నమ్మరు. ఇక శృతి పనమ్మాయిగా చేస్తున్న విషయం తులసి , అంకిత కంట బడుతుంది. తర్వాత ఏం జరిగింది. ? తెలియాలంటే స్టార్ మాలో సాయంత్రం వచ్చే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.