English | Telugu

Illu illalu pillalu : వేరే అతన్ని పెళ్ళి చేసుకున్న ప్రేమించిన అమ్మాయి.. అతను ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -12 లో.. నర్మద సాగర్ కి ఫోన్ చేస్తుంది. రామరాజు లిఫ్ట్ చేయబోతుంటే.. అప్పుడే సాగర్ నేను మాట్లాడుతానంటు ఫోన్ తీసుకొనిమ. అన్న అంటూ మేనేజ్ చేస్తూ మాట్లాడతాడు. గంటలో నువ్వు ఇక్కడ ఉండాలని నర్మద అనగానే బిజీ ఉన్నానని రానని చెప్తాడు. మరొకవైపు ధీరజ్ తన మామ సరదాగా బయట తిరుగుతుంటే. అదే సమయంలో ప్రేమ ప్రేమించిన కళ్యాణ్ ఫుల్ గా తాగి పడిపోయి ఉంటాడు.

మామ ఒక్కసారి వాడిని చూడు ఒకవేళ వాడికి మీ అన్న కూతురు ప్రేమని ఇచ్చి పెళ్లి చెయ్యమంటే.. ఏం చేస్తావని అంటాడు. అలా ఎందుకు అంటున్నావని అతను అనగానే.. మీ అన్న కూతురు ప్రేమ ప్రేమించింది వీడినే.. వద్దని చెప్పినా వినలేదని ధీరజ్ తన మామకి చెప్తాడు. మరొకవైపు సాగర్ కి నర్మద ఫోన్ చేస్తోంటే.. లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత నర్మదని చూడడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. దాంతో నర్మద నాన్న నర్మదకి ఫోన్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చెయ్యదు. ఇక ఆ తర్వాత నర్మదనే డైరెక్ట్ మిల్ దగ్గరికి వస్తుంది. తనని చూసి సాగర్ టెన్షన్ పడతాడు. ఎవరు కావాలని రామరాజు అడుగుతాడు. అతనంటు సాగర్ వంక చూపిస్తుంది. సాగర్ వచ్చి అదే రైస్ కావాలన్నారు కదా అంటూ డైవర్ట్ చేస్తాడు.

ఆ తర్వాత సరే ఇచ్చి పంపించమని రామరాజు అంటాడు. ఎవరు రానట్టు ఉన్నారు. నువ్వే వెళ్లి వేసి రా అని రామరాజు చెప్తాడు. ఎవరి కూతురని రామరాజు అడుగగా.. ప్రసాద్ రావు గారి కూతురు.. అనగానే ఆయన నాకు తెలుసంటూ రామరాజు మాట్లాడుతాడు. ఇక ఆ తర్వాత సాగర్, నర్మద ఇద్దరు రైస్ బ్యాగ్ తీసుకొని ఆటోలో వెళ్తుంటారు. నర్మద సైలెంట్ గా ఉంటుంది. దాంతో ఇద్దరు ఆటో దిగి మాట్లాడుకుంటారు. నీకు చెప్పేది అర్ధం అవ్వడం లేదా ఇంట్లో పెళ్లి చూపులు అరెంజ్ చేశారని.. ఎలాగైనా మనం పెళ్లి చేసుకోవాలి.. మీ నాన్నతో మాట్లాడమని సాగర్ కి నర్మద చెప్తుంది. తరువాయి భాగంలో సుభద్ర చందుని కాకుండా వేరే ఒకతన్ని పెళ్లి చేసుకుంటుంది. అది చూసి ధీరజ్ ని హగ్ చేసుకొని ఏడుస్తాడు చందు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.