English | Telugu

రిషి నటిస్తున్నాడనే నిజం తెలుసుకున్న శైలేంద్ర, దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1162 లో.. సరోజ, శైలేంద్ర మాట్లాడుకుంటారు. మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా అంటూ సరోజ నిలదీయడంతో.. శైలేంద్ర షాక్‌ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషినేనా అని అనుమానిస్తాడు. తర్వాత షాక్‌ నుంచి తేరుకుని మీ బావను మీ ఊరికి పంపించే బాధ్యత నాది అని చెప్తాడు. అయితే ఎండీ సీట్ కోసం స‌రోజ‌ను కూడా పావుగా వాడుకోవాలి అనుకుంటాడు శైలేంద్ర‌. వ‌సుధార‌పై స‌రోజ మ‌న‌సులో ద్వేషాన్ని నింపుతాడు. మీ బావ నీకు ద‌క్కాలంటే నేను చెప్పిన‌ట్లు చేయాలంటాడు శైలేంద్ర. మరోవైపు వ‌సుధార‌కు రిషి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడు. వసుధారకు చెప్పకుండా చ‌క్ర‌పాణి ఇంటికి తీసుకెళ్తాడు. తండ్రిని చూసిన వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది.

అదేంటి మామయ్య మీరు వసుధారను ఎలా ఉన్నావని కూడా అడగట్లేదని చక్రపాణితో రిషి అనగానే.. నీ ద‌గ్గ‌ర వ‌సుధార ఉన్న‌ప్పుడు ఇంకా ఎలా ఉన్నావని అడ‌గాల్సిన ప‌నిలేదు బాబు అని చక్రపాణి అంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి శరీరమంతా గాయాలతో వస్తాడు. అతడిని చూసి ఎవరు సర్ ఇతను అని వసుధార అడుగగా.. ఇన్ని రోజులు నేను ఎవ‌రి పేరుతో బ‌య‌ట ‌తిరుగుతున్నానో అత‌డే ఇతను. అస‌లైన రంగా ఇత‌డే అని రిషి అంటాడు. రిషి మాటలకు వ‌సుధార షాక‌వుతుంది. అసలైన రంగాను బుజ్జి గుర్తుపడతాడు. అసలు ఏం జరిగిందని వసుధార అడుగగా.. రంగా ఓ మెకానిక్ అని, తనపై కొంద‌రు ఎటాక్ చేస్తోండ‌గా..రంగా వారికి అడ్డుగా వెళ్లి త‌న ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడ‌ని జ‌రిగిన క‌థ మొత్తం రిషి చెప్తాడు. చిన్న‌ప్పుడే రంగా ఊరు వ‌దిలిపెట్టి వెళ్ల‌డంతో.. నేను రంగాను అని చెప్పినా ఎవ్వరూ అనుమానించలేదని రిషి చెప్తాడు. అమ్మ నాకు రాసిన లెటర్‌ ఇవ్వడానికి వచ్చి ఈ రంగా తన ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడ‌ని, అమ్మ రాసిన లెటర్‌లో చాలా నిజాలు ఉన్నాయని చెప్తాడు రిషి.

మరోవైపు కొడుకును తిడుతుంది దేవయాని. నువ్వు చేసే ప‌నుల‌న్నీ ఇలాగే ఉంటాయి శైలేంద్ర. అస‌లు అత‌డు రంగానే కాద‌ని రిషి అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానని దేవయాని అనగానే.. అవును మామ్‌ కానీ వాడు రంగా అని నన్ను నమ్మించాడని శైలేంద్ర అంటాడు. వాడు రిషి కాబట్టే.. నువ్వు ఊరు వెళ్లిన‌ప్పుడు వ‌సుధార నీ కంట ప‌డ‌కుండా దాచిపెట్టాడు. ఇప్పుడు ఏ భ‌యం లేకుండా కాలేజీలో, ఇంట్లో తిరుగుతున్నాడు. వాడు రిషి కాక‌పోతే వ‌సుధార వాడితో ఎందుకు క‌లిసి ఉంటుంది అంటుంది.

వసుధారతో స‌రోజ‌కు ఫోన్ చేయిస్తాడు రిషి. వ‌సుధార మాట విన‌గానే స‌రోజ ఫైర్ అవుతుంది. నిన్ను వ‌దిలేది లేద‌ని అంటుంది. నువ్వు, శైలేంద్ర క‌లిసే ఈ డ్రామా ఆడారంటూ కోపంగా తిడుతుంది. అయితే సరోజ మాటలతో శైలేంద్ర‌, దేవయానిలకు తాను రిషిని అన్న విషయం తెలిసి ఉండొచ్చని రిషి అనుకుంటాడు. రిషి సార్‌ జగతి మేడం రాసిన లెటర్‌ చూపించి మీ అన్నయ్య కుట్రలను బయటపెట్టొచ్చు కదా? అని వసుధార అనగానే.. ఇన్ని చేసిన వాళ్ల‌కు ఆ లెట‌ర్ అబ‌ద్ధం అని నిరూపించ‌డం పెద్ద విష‌యం కాదు వసుధార అని రిషి అంటాడు. మరి ఎలా సర్‌ ఆ శైలేంద్ర కుట్రలను ఆపేది అని వసుధార అనగానే.. వాళ్ల నోటితోనే నిజాలన్నీ బ‌య‌ట‌పెట్టిస్తాను. వాళ్ల నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డే టైమొచ్చిందని రిషి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మహేంద్ర దగ్గరికి వెళ్తారు. అదేసమయంలో శైలేంద్ర కూడా వస్తాడు. ఇక్కడెందుకున్నావని శైలేంద్రని రిషి అడగ్గా.. బాబాయ్ ఎలా ఉన్నాడో..అస‌లు ఉన్నాడో లేదో చూద్దామ‌ని వ‌చ్చాన‌ని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.