Read more!

English | Telugu

చందు గౌడ ఇంట్లో సంబరాలు!

బుల్లి తెర నటుడు చందూ గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను 'త్రినయని' సీరియల్ ద్వారా మంచి ఫేమస్ ఐన యాక్టర్. యాక్ట్యువల్ గా చందు గౌడ కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు. అక్కడ 'లక్ష్మి బారామ్మా' అనే సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2020 లోనే ఇతను షాలిని  అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. చందూ పుట్టుకతోనే శ్రీమంతుడు. అతని తండ్రి బైరప్ప బెంగళూర్‌లో బిగ్ బిజినెస్ మాగ్నెట్స్ లో ఒకరు. ఇక ఇప్పుడు చందు గౌడ తాను తండ్రినయ్యానంటూ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా చందూగౌడ, ఆయన భార్య షాలిని ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. 

మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు ఆడపిల్ల పుట్టింది. చందు, షాలిని వాళ్ళ  చిన్ని పాపను చాలా సంతోషంతో స్వాగతించారు.  తనకు ఒక ఆడపిల్ల పుట్టిందని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు చందూ. తనకు అన్నీ ఉన్నా.. ప్రత్యేకమైన గుర్తింపులేదనే బాధే త‌న‌ని నటుడ్ని చేసిందంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, ఇప్పుడు మూవీస్ లో నటించడానికి సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది చందు గౌడ. ఇక కూతురు పుట్టిందన్న విషయం తెలుసుకున్న చందు గౌడ ఫ్రెండ్స్ ఫామిలీ మెంబెర్స్ , నెటిజన్స్ అంతా అతన్ని అభినందిస్తూ విషెస్ చెప్తున్నారు.