Read more!

English | Telugu

కృష్ణవంశీ మాట మీద నిలబడే వ్యక్తి

బ్రహ్మాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఐతే బ్రహ్మాజీ కృష్ణవంశీ కి మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అనుబంధం గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చెన్నైలో ఒక ఇంటరెస్టింగ్ బిల్డింగ్‌ ఉండేదట . పొంగా కల్యాణమండపం అంటారట దాన్ని. అందులో 100  గదులు బాత్రూం సైజు అంత ఉండేవట.  ఐఏఎస్‌, ఐపీఎస్‌ శిక్షణ కోసం కోర్సులు చదివేవాళ్లతో పాటు సినిమాల్లో ఛాన్సెస్ కోసం ట్రై చేసేవాళ్లంతా ఆ బిల్డింగ్ లో అద్దెకు ఉంటారని చెప్పారు. అంత చిన్న గదుల్లో  ఎల్‌ షేప్‌లో బెడ్లు ఉంటాయట.ఒక్కో గదిలో ఇద్దరం ఉండేవాళ్లం. ఒక్కొక్కరు 125 రూపాయలు కట్టాలి. అలా ఆ బిల్డింగ్ లో 500 మంది  ఉండేవారట. ఇకపోతే.. పాండీబజార్‌లో ఓ అడ్డాకు కృష్ణవంశీ వచ్చేవాడట. అక్కడే ఆయనతో పరిచయం అయ్యిందని చెప్పుకొచ్చారు.  సాయంత్రంపూట కబుర్లు చెప్పుకునేవాళ్లం. అదే టైంలో  వంశీ వాళ్లది కూడా తాడేపల్లిగూడెం అని తెలిసింది దాంతో మేం ఇంకా దగ్గరయ్యాం. 

అన్నపూర్ణ సంస్థ వాళ్లు అప్పుడే  ‘శివ’ చిత్రం కోసం కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని తెలిసి ఆడిషన్ ఇచ్చిరమ్మని  కృష్ణవంశీ బ్రహ్మాజీకి చెప్పారట.  ఆ టైంలో బ్రహ్మాజీ దగ్గర ఒక బైక్ ఉండేది. దాని మీద  కృష్ణవంశీని ఎక్కించుకుని అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లాడట.  అక్కడికి అదే టైంకి కళ్ళజోడు పెట్టుకున్న ఒక వ్యక్తి  శివనాగేశ్వరరావు గారితో టీ తాగి లోపలికి వెళ్తున్నాడు. శివనాగేశ్వరావును అప్పుడు వంశి పిలిచి  మన స్నేహితుడే అని పరిచయం చేశారట. శివనాగేశ్వరావు ఫోటోలు అడిగేసరికి బ్రహ్మాజీవి ఇచ్చారట. వాటిని రాము చూసి ‘ఫొటోలతో పనేముందు అతనుంటే ఆడిషన్‌ చేయించండి’ అన్నారట. అంతా అయ్యాక రెండో రోజు రమ్మన్నారని వెళ్లేసరికి అక్కడ డైరెక్టర్ తేజ ఉన్నారట. ఆ తర్వాత ఆ మూవీకి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా వంశీ చేరడం ఒక చిన్న క్యారెక్టర్ కి తాను వెళ్లడం ఒకేసారి జరిగిందని చెప్పారు. డైరెక్టర్ ఐతే కచ్చితంగా ఒక రోల్ ఇస్తానని చెప్పిన వంశి తాను తీసిన గులాబీ మూవీలో మంచి రోల్ ఇచ్చారని చెప్పారు బ్రహ్మాజీ. ఆ తర్వాత తన లైఫ్ లో వెనక్కి చూసుకోవాల్సిన పని లేకుండా ఎన్నో మూవీస్ చేసానని చెప్పారు.