English | Telugu

Brahammudi :యామిని వేసిన ప్లాన్ అదే.. రాజ్ కి రుద్రాణి నిజం చెప్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -806 లో..... రాజ్ వెళ్తుంటే యామిని పేరెంట్స్ ఆపుతారు. అప్పుడే అపర్ణ ఇందిరాదేవి ఏంట్రీ ఇస్తారు. కళావతి వస్తుందనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చారేంటని రాజ్ అనుకుంటాడు. రాజ్ నువ్వంటే కావ్యకి చాలా ఇష్టం.. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. లేదు నేను వెళ్ళాలని రాజ్ అక్కడ నుండి బయల్దేరతాడు.

ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి నీ వల్ల బావ అమెరికా వెళ్తున్నాడు. నువ్వు దూరం చేసావ్ మమ్మల్ని.. నీకు తెలియకుండా ఇప్పుడు నువ్వే మళ్ళీ మమ్మల్ని దగ్గర చేసావని కావ్యతో యామిని అంటుంది. ఆ తర్వాత రుద్రాణికి యామిని ఫోన్ చేసి ఏదో ఐడియా ఇస్తుంది. ఇప్పుడే వెళ్లి ఈ ప్లాన్ అమలుచేయు అనగానే రుద్రాణి సరే అని బయల్దేర్తుంది.

ఏంటి మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావని రాహుల్ అడుగుతాడు. రాజ్ దృష్టిలో కావ్యని చెడ్డదాన్ని చెయ్యడానికి అని రుద్రాణి హడావిడిగా వెళ్తుంది. ఆ తర్వాత రాజ్ తనకి దూరంగా వెళ్తున్నాడని కావ్య దేవుడికి తన బాధని చెప్పుకుంటుంది. కావ్య తన కోసం ఎలాగైనా వస్తుందని రాజ్ అనుకుంటాడు. ఒక దగ్గర కార్ ఆపుతాడు రాజ్ . కానీ కావ్య కాకుండా రాజ్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. రాజ్ నీతో మాట్లాడాలని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.