English | Telugu

Brahmamudi : ఇంటి కోడలి కోసం దిగొచ్చిన దుగ్గిరాల కుటుంబం.. భార్యకి క్షమాపణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -517 లో....కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోయిన విషయం అపర్ణ కి తెలియడంతో షాక్ అవుతుంది. అసలు ఇంట్లో ఏం జరిగిందని మొత్తం అపర్ణకి చెప్తుంది స్వప్న. నా కోడలు పౌరుషం కలది.. ఆత్మభిమనo కలది.. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. నేను వెళ్ళమంటెనే నన్ను వదిలేసి వెళ్ళిందని అపర్ణ అనగానే.. చూసారా ఇప్పుడైనా నిజం తెలుసుకున్నారా అని స్వప్న అంటుంది.

నా కోడలు వెళ్లిపోవడం లో తప్పులేదు.. తన మనసు ముక్కలు చేసి పంపించారు. నీ మీద నాకు కోపం రావడం లేదని రుద్రాణిని అపర్ణ అంటుంది. ఎందుకంటే చెప్పిన వారి కంటే చెప్పుడు మాటలు విన్న వాళ్ళది తప్పు. నా కొడుకుది తప్పు. నువ్వు వెళ్లి క్షమించమని అడిగి నా కోడలిని తీసుకొని రా అని రాజ్ కి అపర్ణ చేప్తుంది. నేను వెళ్ళమనలేదు నేను తీసుకొని రాలేనని రాజ్ వెళ్ళిపోతాడు. నా కోడలిని నేనే తీసుకొని వస్తానని అపర్ణ వెళ్తుంటే.. నీ ఆరోగ్యం బాలేదు.. మేమ్ వెళ్లి తీసుకొని వస్తామని సీతారామయ్య ఇందిరాదేవిలు అంటారు. ఇప్పుడు ఆ కావ్య ఇంటికి వస్తే మనం ఇప్పటివరకు చేసింది మొత్తం ఫెయిల్ అవుతుందని రాహుల్ అంటాడు. కావ్య మనసు ముక్కలు అయింది రాదని రుద్రాణి అంటుంది.

మరుసటి రోజు ఉదయం సీతారామయ్య, ఇందిరాదేవిలు కావ్య దగ్గరికి వస్తారు. ఇంటికి రమ్మని పిలుస్తారు నేను రాలేను. ఏ స్థానంలో రావాలి. భర్తకి తన మనసులో చోటు లేనప్పుడు నేను ఎలా వస్తానంటూ కావ్య డైరెక్ట్ గా చెప్తుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్ధమవుతుంది వాడే వచ్చి నిన్ను క్షమించమని అడుగుతాడంటూ సీతారామయ్య, ఇందిరాదేవిలు వెళ్లిపోతారు. తరువాయి భాగంలో కావ్య దగ్గరకి రాజ్ వెళ్లి రమ్మని పిలిస్తాడు. రానని కావ్య అనగానే రాకుంటే కాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.