English | Telugu

Brahmamudi : సామంత్ కాలర్ పట్టుకున్న అనామిక.. వదిలేసిపోయిన ప్రియుడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -614 లో.. అనామికకి సెక్యూరిటీ ఫోన్ చేసి మీ దగ్గర ఉంది డుబ్లికేట్ కిరీటం, కావ్య మేడమ్ ఒరిజినల్ కిరీటం లాకర్ లో పెట్టి.. ఇప్పుడు తీసింది అనగానే అనామిక షాక్ అవుతుంది. అప్పుడే కావ్య వచ్చి సెక్యూరిటీ దగ్గర ఫోన్ లాక్కొని ఏంటి అనామిక షాక్ అయ్యావా అంటుంది. నీకు అంత తెలివి ఉంటే నాకు ఎంత ప్లాన్ ఉండాలని నీ ప్లాన్ నీకే తిప్పి కొట్టానని కావ్య మాట్లాడుతుంది. ఆ తర్వాత నిన్ను కొట్టొచ్చు పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కానీ అలా చెయ్యడం లేదు ఎందుకంటే నీకు ఫ్యామిలీ ఉందని, ఎక్కడికైనా వెళ్లి నిజాయితీగా పని చేసుకోమని సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది కావ్య.

నువ్వు కావ్య తెలివి ముందు ఎందుకు పనికి రావని సామంత్ అనగానే.. ఏం అన్నావంటూ సామంత్ షర్ట్ పట్టుకుంటుంది అనామిక. దాంతో నేను పట్టుకోగలనని సామంత్ కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. మరొకవైపు జగదీశ్ చంద్రకి నగలు ఇస్తారు. ఆ తర్వాత చాలా థాంక్స్ టైమ్ కి వచ్చావని అంటాడు. శత్రువులకి మనకి ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకే అలా లాకర్ పెట్టనని కావ్య అనగానే.. చాలా ముందుచూపుగా ఆలోచించావని కావ్యతో రాజ్ అంటాడు. కానీ జగదీశ్ చంద్ర గారు మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యాక డబ్బు ఇస్తానంటున్నారని అనగానే.. పర్లేదు మనం మేనేజ్ చేద్దామని కావ్య అంటుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి మేనమామ శ్రీనివాస్ ఇంటికి వస్తాడు. ప్రకాష్ కంపెనీకి సంబంధించిన గోల్డ్ తక్కువ ధరకి ఇవ్వడానికి అతన్ని ఒప్పిస్తాడు. అందుకు అతను సరేనంటాడు.

ఆ తర్వాత కావ్య, రాజ్ లు రాగానే ప్రకాష్ ఆ విషయం చెప్తాడు. వద్దని కావ్య, రాజ్ లు ఇద్దరు అంటారు. ఇంత కష్టపడి ఒప్పిస్తే వద్దంటారా అని ప్రకాష్ అంటాడు. మీరు ఇంట్లో ఏంత చెప్తే అంత అన్నారు కదా.. ఇదేనా మీ విలువ అంటూ శ్రీనివాస్ వెళ్లిపోతాడు. మా బంధువుల ముందు మా పరువు తీశారంటూ ధాన్యలక్ష్మి విరుచుకుపడుతుంది. కంపెనీకి సంబంధించిన నిర్ణయం నేనే తీసుకుంటానని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రకాష్ బాధపడుతుంటే సుభాష్ వెళ్తాడు. ఈ రోజు ఇంట్లో నా విలువ తెలిసిందని ప్రకాష్ అంటాడు. అసలు కావ్య ఎందుకిలా చేస్తుందని సుభాష్ అంటాడు. తరువాయి భాగంలో ప్రకాష్ దగ్గరికి కావ్య వచ్చి సారీ చెప్తుంది. అందరి ముందు అవమానించి.. ఇప్పుడిలా చేస్తున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇప్పటికైన తాతయ్య మాట విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.