English | Telugu

Brahmamudi : కీలకంగా మారిన ప్రాజెక్ట్‌.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -567 లో...కళ్యాణ్ దగ్గరికి అప్పు వస్తుంది. మీ వదిన తిరిగి మళ్ళీ మీ ఇంటికి వస్తుందట అని అనగానే.. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం పూర్తి అయ్యేవరకు నీ పోలీస్ ట్రేనింగ్ అయిపోవాలి.. నీకు కావాల్సింది నేను రైటర్ గా సెటిల్ అవడం కదా.. ఇప్పటి నుండి సీరియస్ గా ట్రై చేస్తానని అప్పుకి కళ్యాణ్ చెప్తాడు.

మరోవైపు కనకంకి ఇందిరాదేవి ఫోన్ చేసి.. జరిగింది చెప్తుంది. త్వరలోనే కావ్య అక్కడికి రాబోతుందా అని కనకం మురిసిపోతుంది. అప్పుడే కావ్య వస్తుంది. పెద్దాయన పందెం కట్టాడట.. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తున్నావట అని కనకం అనగానే.. ఇప్పుడే అలా అని ఫిక్స్ కాకు అని కావ్య అంటుంది. నువ్వు గెలుస్తావని కనకం అంటుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. నువ్వు చేసిన ప్లాన్ కి ఇక్కడ రాజ్ , కావ్యలని ముసలోడు కలపాలని చూస్తున్నాడని జరిగింది మొత్తం రుద్రాణి చెప్తుంది. అయితే ఈ పందెంలో ఎవరు గెలిచిన మనకే నష్టం అన్నమాట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేస్తానని అనామిక అంటుంది.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. రాజ్, కావ్యల గురించి నెగెటివ్ గా చెప్తుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే ఎవరు అల్ ది బెస్ట్ చెప్పట్లేదని అడిగి మరీ అల్ ది బెస్ట్ చెప్తారు. కని ఇండైరెక్ట్ గా అందరు కావ్యకి అల్ ది బెస్ట్ చెప్తారు. రాజ్ ఆఫీస్ కి వెళ్లి ఎలాగైనా పందెంలో గెలవాలని ప్రయత్నం మొదలు పెడతాడు. తరువాయి భాగంలో ఎంప్లాయిస్ కి వర్క్ బాగా చెయ్యండి అంటూ ఆఫర్స్ ఇస్తాడు. ఆ తర్వాత అనామిక ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇద్దరు గోడవళ్ళో ఉన్నారు. అలాంటోళ్ళు ప్రాజెక్ట్ ఎలా బాగా చేస్తారని అనగానే.. అవునని అతను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.