Read more!

English | Telugu

మళ్ళీ ప్రేమలో పడొచ్చా ...అంటున్న అష్షు!

అష్షు రెడ్డి సోషల్ మీడియా స్టార్ గా పేరు తెచ్చుకుంది. బుల్లితెర మీద ఈవెంట్స్ లో  కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ , అష్షురెడ్డి ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తామిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని గతంలో చాలా సార్లు వీలు చెప్పుకున్నారు. అంతేకాదు పార్టీలకు, పబ్బులకు కలిసి వెళ్లి సందడి చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. 

ఇటీవల అష్షు మాత్రమే ఎక్కడికైనా సరే ఒంటరిగా ప్రయాణం చేస్తోంది. ఐతే అసలు విషయానికి వస్తే అష్షు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  శారీలో నిలబడి దీర్ఘంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫోటో పెట్టి " చాలా కాలం క్రితం గుండె ముక్కలైపోయింది అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రేమలో పడగలమా ? " అని ఒక కాప్షన్ పెట్టింది. ఇంతకు అష్షు గుండెను బ్రేక్ చేసింది ఎవరో తెలీదు. మళ్ళీ ఎవరితో ప్రేమలో పడిందో కూడా రివీల్ చేయలేదు. ఇక నెటిజన్స్ అష్షుకి మెసేజెస్ కూడా పెట్టారు "ప్రేమలో పడే అవకాశం ఉంది.

కానీ పాత గాయం మానడానికి కొంచెం టైం పడుతుంది కదా" అన్నారు. మరో నెటిజన్ కొంటెగా ఆన్సర్ ఇచ్చాడు "గుండె ముక్కలైపోతే గనక ఒక్కో భాగం ఒక్కో పర్సన్ ని ప్రేమించొచ్చు" అని..ఇకపోతే అష్షు" ఏ మాస్టర్ పీస్" పేరుతో రూపొందుతోన్న  సినిమాలో ఆద్య అనే పాత్రలో కనిపించబోతోంది.