English | Telugu
శ్యామల డ్రీమ్ హోమ్.. ఏముంది గురూ!
Updated : Jul 27, 2022
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఏ వీడియో పోస్ట్ చేసినా దానికి లైక్స్, కామెంట్స్ లక్షల్లో వస్తూ ఉంటాయి. దీని కోసం సెలెబ్స్ అంతా ఇంట్లో చేసే ఏ పనైనా కావొచ్చు.. వీడియో తీసి తమ తమ యూట్యూబ్ చానెల్స్ లో పోస్ట్ చేసేస్తున్నారు. హోమ్ టూర్స్ అంటూ చాలా మంది వాళ్ళ వాళ్ళ కొత్త ఇళ్లను వర్ణిస్తూ చెప్పే ట్రెండ్ ఇప్పుడు బాగా ఎక్కువయ్యింది. ఇలాంటి స్పెషల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరికి టచ్ లో ఉంటున్నారు. ఆ లిస్టులో యాంకర్ శ్యామల కూడా చేరింది. తాజాగా ఆమె తన హోమ్ టూర్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.
శ్యామల మూవీస్ లో యాక్ట్ చేస్తుంది, సీరియల్స్ లో నటిస్తుంది, యాంకర్ గా కూడా రాణిస్తోంది. వీటితో పాటు అప్పుడప్పుడు కొన్ని మూవీ ప్రమోషన్స్ కి కూడా హోస్ట్ గా చేస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక కొత్త ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు ఆ ఇంట్లోని విశేషాల గురించి చెప్తూ "వెల్కమ్ టు మై నెస్ట్" పేరుతో ఒక హోమ్ టూర్ వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి ఖాళీ ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఇంటి ముందు ఒక అరుగుని వేయించుకుంది. అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేసుకుంది. తర్వాత ఇంటి మొత్తాన్ని కూడా చూపించింది శ్యామల. తనకు దైవభక్తి చాలా ఎక్కువట. అందుకే పూజ గది అలంకరణను కూడా చూపించింది.
విశాలమైన కిచెన్, డైనింగ్ టేబుల్, ఇంట్లోని హాల్స్, బెడ్ రూమ్స్ అన్ని చూపించేసింది. తన సుపుత్రుడి ఇషాన్ కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసిన బెడ్ రూమ్, అటాచ్డ్ బాల్కనీ, ఇంట్లో ఉన్న లిఫ్ట్, ఓపెన్ వార్డ్రోబ్, రీడింగ్ ప్లేస్, మాస్టర్ బెడ్‌రూమ్, అలాగే ఇంటి పైన ఏర్పాటు చేయించిన సోలార్ ప్యానెల్‌ని కూడా ఈ వీడియోలో చూపించింది. ఇల్లు మొత్తం కూడా బ్రాంజ్ తో తయారు చేసిన వస్తువులనే ఇంటినిండా అలంకరించుకుంది శ్యామల.
అలాగే 1995లో ఫస్ట్ టైం స్టేజి మీద పాట పాడినందుకు వచ్చిన ప్రైజ్ ని కూడా దాచుకుని మరీ చూపించింది శ్యామల. అలాగే తనకు ఇష్టమైన వీణను కూడా చూపించింది. రేపటి రోజున పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకోసం లిఫ్ట్ కూడా పెట్టించినట్లు చెప్పింది. ఇంకా ఇషాన్ వేసిన డ్రాయింగ్స్ ని కూడా చూపించింది. ఇలా శ్యామల పోస్ట్ చేసిన హోమ్ టూర్ వీడియో నెటిజన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.