English | Telugu
చలాకీ చంటితోనూ రష్మీకి ఎఫైరా?
Updated : Jun 8, 2022
`జబర్దస్త్` కామెడీ షో ద్వారా యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జంట పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఎంతలా అంటే వారు వుంటేనే షో టీఆర్పీ రేటింగ్ పెరిగిపోయేంత. వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ వీరిని వైరల్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో మ్యాజిక్ జరుగుతోందని, ఇద్దరూ ప్రేమలో వున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా ఈ వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఈ వార్తలని నిజం చేయాలని రోజా రెండు మూడు సార్లు జబర్దస్త్ వేదికపైనే వీరికి ఉత్తుత్తి పెళ్లి చేసి తన ముచ్చట తీర్చుకున్నారు కూడా.
అయితే లవ్ ఎఫైర్ వార్తలపై తాజాగా రష్మీ గౌతమ్ స్పందించింది. ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ గౌతమ్ తన లవ్ ఎఫైర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రష్మీ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ అన్నారు. ఆ తరువాత చలాకీ చంటితోనూ తనకు లింకు పెట్టారని వాపోయింది. ఇక మిగిలిన టీమ్ మెంబర్స్ లో చాలా మందికి పెళ్లి అయిందని ఆ కారణంగానే వారితో తనకు ఎఫైర్ వుందని రూమర్ లు పుట్టించలేదని తెలిపింది.
లవ్ ఎఫైర్ రూమర్స్ రావడానికి ప్రధాన కారణం పెళ్లి కాకపోవడం, ఒకే ఏజ్ కి చెందిన వాళ్లు కావడమేనని తెలిపింది. ఇలాంటి రూమర్స్ ని తాను సీరియస్ గా తీసుకోనని, సరదాగానే తీసుకుంటానని తెలిపింది. జబర్దస్త్ లోకి వచ్చాక తనలో చాలా మార్పు వచ్చిందని, ప్రతి విషయాన్ని కామెడీగానే తీసుకుంటున్నానని.. అది అలా అలవాటైపోయిందని తెలిపింది. ఎంతటి సీరియస్ విషయం అయినా తనకు లైట్ గానే అనిపిస్తోందని, అందుకే తనపై వచ్చే ఎఫైర్ న్యూస్ లని పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేసింది రష్మీ.