English | Telugu
దుల్కర్ వైఫ్ తనని ఏమని పిలుస్తుందో తెలుసా?
Updated : Jul 28, 2022
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో `క్యాష్.. దొరికినంత దోచుకో`. ప్రతి శనివారం ఈటీలో ప్రసారం అవుతున్న ఈ షో వీక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమ పంచ్ లు, గెస్ట్ ల అల్లరితో ఈ షో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ విజయవంతంగా సాగుతోంది. తాజాగా ఈ శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ షోలో 'సీతారామం' మూవీ టీమ్.. హీరో దుల్కర్ సల్మాన్, నటులు సుమంత్, తరుణ్ భాస్కర్, డైరెక్టర్ హను రాఘవపూడి పాల్గొని సందడి చేశారు.
'సీతారామం' మూవీని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై సి. అశ్వనీదత్ నిర్మించారు. ఆగస్టు 5న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్, దర్శకులు తరుణ్ భాస్కర్, హను రాఘవపూడి, సుమంత్ `క్యాష్ దొరికినంత దోచుకో` షోలో పాల్గొని సందడి చేశారు.
దుల్కర్ సల్మాన్, దర్శకులు తరుణ్ భాస్కర్, సుమంత్ ఈ షోలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక షోలోకి దుల్కర్ ఎంటర్ కాగానే అభిమానులు ఈలలు వేస్తూ గోల చేశారు. ఇదే సమయంలో దుల్కర్ ని లేడీ ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు వేశారు. మీ వైఫ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారని అడిగితే దుల్కర్ చెప్పిన సమాధానంతో అక్కడున్న వారి అరుపులతో క్యాష్ షో రీసౌండ్ తో మోత మోగిపోయింది. తన వైఫ్ తనని 'జాన్' (ప్రాణం) అని పిలుస్తుందని ఈ సందర్భంగా దుల్కర్ సమాధానం చెప్పాడు. తాజా ఎపిసోడ్ జూలై 30న రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.