ఒకే దర్శకుడితో దీపిక బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!
పెళ్ళయ్యాక కూడా హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన హవా సాగిస్తోంది బాలీవుడ్ దివా దీపికా పదుకోణ్. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాలే.. `పఠాన్`, `ఫైటర్`, `సర్కస్`, `ప్రాజెక్ట్ కె`. వీటిలో `సర్కస్` కోసం అతిథి పాత్రలో దర్శనమివ్వనున్న దీపిక.. మిగిలిన మూడు సినిమాల్లోనూ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తోంది.