English | Telugu

నో చెప్పాక కూడా ఆ డైరెక్ట‌ర్ వ‌ద‌ల్లేదు!

బాలీవుడ్ స్మైలింగ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ ఓ బిగ్ ఫిల్మ్‌లో న‌టించ‌డానికి దాని ద‌ర్శ‌కుడు త‌న‌తో గ‌డ‌పాల‌ని అడిగాడ‌నీ, అందుకు తాను తిర‌స్క‌రించాన‌నీ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించింది. ఆ సినిమా ఆఫ‌ర్ వ‌ద్ద‌నుకున్న త‌ర్వాత కూడా ఆ డైరెక్ట‌ర్ త‌న‌కు కాల్ చేశాడ‌నీ, కానీ తాను ఆ సినిమా చేయ‌డానికి ఒప్పుకోలేద‌నీ తెలిపింది. 2006లో పాపుల‌ర్ టీవీ సీరియ‌ల్‌ 'క‌స‌మ్ సే' ద్వారా న‌ట‌నా రంగంలోకి అడుగుపెట్టింది ప్రాచీ. అందులో ఆమె రామ్ క‌పూర్ స‌ర‌స‌న న‌టించింది.

2008లో 'రాక్ ఆన్' మూవీ ద్వారా ఆమె టీవీ నుంచి సినిమాల్లోకి కాలుపెట్టింది. ఆ త‌ర్వాత 'ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్‌', 'బోల్ బ‌చ్చ‌న్‌', 'అజార్' లాంటి సినిమాల్లో న‌టించింది.

లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో "ఒక బిగ్ ఫిల్మ్‌లో న‌టించ‌డానికి డైరెక్టుగానే ప్ర‌పోజ్ చేశారు. కానీ నేను ఏమాత్రం ఆల‌స్యం చెయ్య‌కుండా నో చెప్పేశాను. నేను చెయ్య‌న‌ని చెప్పాక కూడా, ఆ డైరెక్ట‌ర్ నాకు కాల్ చేశాడు. అప్పుడు కూడా నీ సినిమాలో చేయ‌డానికి నాకు ఇంట్రెస్ట్ లేద‌ని తెగేసి చెప్పాను." అని తెలిపింది ప్రాచీ.

ఇటీవ‌ల ఆమె 'సైలెన్స్‌.. కెన్ యు హియ‌ర్ ఇట్‌?' అనే థ్రిల్ల‌ర్‌లో మ‌నోజ్ బాజ్‌పేయితో క‌లిసి క‌నిపించింది. గ‌త నెల‌లో అది జీ5లో రిలీజ‌య్యింది. గ‌మ‌నిస్తే మిగ‌తా తార‌ల్లాగా ఆమె ఎక్కువ సినిమాలు చెయ్య‌డం లేదు. కార‌ణం ఏంట‌ని అడిగితే, "గ్రేట్ డైరెక్ట‌ర్ల నుంచి కూడా నాకు చాలా రోల్స్ వ‌స్తున్నాయి. కానీ ఆ పాత్ర నాకు ఏ విధంగానూ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని అనిపిస్తే చెయ్య‌న‌ని చెప్పేస్తున్నాను. నా కెరీర్‌కు ఆ రోల్స్ వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం లేనందునే వాటిని వ‌దిలేస్తున్నాను. ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల కోసం నేను వెయిట్ చేస్తున్నాను." అని చెప్పింది ప్రాచీ.