English | Telugu

పుట్టగానే రెండు బంగ‌ళాల‌కు య‌జ‌మాని అయిన రాణీ ముఖ‌ర్జీ కూతురు!

బాలీవుడ్ న‌టి రాణీ ముఖ‌ర్జీ ఏస్ డైరెక్ట‌ర్ ఆదిత్య చోప్రాను పెళ్లాడింది. ఆదిత్య‌కు ఇది రెండో వివాహం. రాణి కోసం మొద‌టి భార్య పాయ‌ల్‌కు డైవోర్స్ ఇచ్చాడు ఆదిత్య‌. బాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్ష‌న్ హౌసెస్‌లో ఒక‌టైన య‌శ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఆదిత్య చైర్మ‌న్‌. అత‌ని తండ్రి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు దివంగ‌త య‌శ్ చోప్రా. 18 ఏళ్ల వ‌య‌సులోనే తండ్రి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేరిన ఆదిత్య సొంతంగా డైరెక్ట్ చేసిన తొలి సినిమాతోటే సంచ‌ల‌నం సృష్టించాడు. అది ఎన్నో రికార్డుల‌ను సొంతం చేసుకున్న 'దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయేంగే'. అప్పుడు ఆదిత్య వ‌య‌సు కేవ‌లం 23 సంవ‌త్స‌రాలు.

రాణీని ముంబైలోని సంప‌న్ హోట‌ల్‌లో తొలిసారి చూశాడు ఆదిత్య‌. అప్ప‌టికే ఆమె న‌టించిన కొన్ని సినిమాలు చూశాడు ఆదిత్య‌. క‌ర‌ణ్ జోహార్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'లో ఓ హీరోయిన్‌గా ఆమెను రిక‌మండ్ చేసింది ఆదిత్య‌నే. వాళ్ల‌ది ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ కాదు. అప్పుడ‌ప్పుడు క‌లుసుకుంటూ వ‌చ్చిన వాళ్ల మ‌ధ్య క్ర‌మేపీ స్నేహం బ‌ల‌ప‌డింది. త‌న వ‌ల్ల ఆదిత్య సంసారం విచ్ఛిన్నం కావ‌డం ఇష్టంలేని రాణి మొద‌ట్లో ఆదిత్య‌ను స్నేహానికే ప‌రిమితం చేసింది. కానీ అత‌ను ఆమె లేనిదే ఉండ‌లేని స్థితికి వ‌చ్చాడు. అయితే పాయ‌ల్‌కు 2009లో ఆదిత్య విడాకులు ఇచ్చిన త‌ర్వాత‌నే అత‌నితో డేటింగ్ ప్రారంభించింది రాణి.

అయిన‌ప్ప‌టికీ పాయ‌ల్ కాపురంలో రాణి నిప్పులు పోసింద‌నే నింద‌లు త‌ప్ప‌లేదు. ఐదేళ్ల త‌ర్వాత అంటే, 2014లో రాణి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు ఆదిత్య‌. ఇద్ద‌రికీ 2015 డిసెంబ‌ర్‌లో ఆదిర పుట్టింది. పుట్టీపుట్ట‌గానే రెండు బంగ‌ళాలకు య‌జ‌మానురాలైంది ఆదిర‌. త‌ల్లిదండ్రులు రాణి, ఆదిత్య ఆమెకు వాటిని కానుక‌గా ఇచ్చార‌న్న మాట‌. వాటిలో ఒక‌టి ఆదిత్య వ‌ర్క్‌ప్లేస్ అయిన య‌శ్ రాజ్ ఫిలిమ్స్ హెడ్‌క్వార్ట‌ర్స్‌కు స‌మీపంలో ఉంటే, ఇంకొకంటి యారీ రోడ్‌లోని రాణి ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉంటుంది.

ఆదిత్య‌కు జుహులో కోట్లాది రూపాయ‌ల విలువ చేసే విలాస‌వంత‌మైన భ‌వ‌నంతో పాటు న‌వీ ముంబైలో రూ. 10 కోట్ల విలువ‌చేసే హౌస్ ఉంది. ఒక అంచ‌నా ప్ర‌కారం అత‌ని ఆస్తుల విలువ సుమారు రూ. 6,500 కోట్లు. అత‌ను చైర్మ‌న్‌గా ఉన్న వైఆర్ఎఫ్ ట‌ర్నోవ‌ర్ ఏడాదికి రూ. 960 కోట్లు.