English | Telugu

అక్ష‌య్ సినిమాకి అనిరుధ్ బాణీలు

"వై దిస్ కొల‌వెరి కొల‌వెరి డి" అంటూ దాదాపు ద‌శాబ్దం క్రితం యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు అనిరుధ్. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ న‌టించిన త‌మిళ చిత్రం '3'తో స్వ‌రంగేట్రం చేసిన అనిరుధ్.. మొద‌టి ప్ర‌య‌త్నం(పాట‌)తోనే యావ‌త్ భార‌త‌దేశాన్ని త‌న బాణీతో మెస్మ‌రైజ్ చేశాడు. ఆపై ప‌లు త‌మిళ చిత్రాల‌తో కోలీవుడ్‌లో స్టార్ కంపోజ‌ర్ అనిపించుకున్న అనిరుధ్.. తెలుగులోనూ 'అజ్ఞాత‌వాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడ‌ర్' వంటి సినిమాల‌తో త‌న‌దైన ముద్ర‌వేశాడు.

క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో అనిరుధ్ బాలీవుడ్ బాట ప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. స్టార్ హీరో అక్ష‌య్ కుమార్, వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేష‌న్‌లో 'అత్రంగి రే' త‌రువాత `రక్షా బంధ‌న్` పేరుతో మ‌రో సినిమా రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్న‌ట్లు వినికిడి.

వాస్త‌వానికి చియాన్ విక్ర‌మ్ న‌టించిన మ‌ల్టిలింగ్వ‌ల్ మూవీ 'డేవిడ్'కి అనిరుధ్ ఒక పాట కోసం బాణీని అందించాడు. హిందీలోనూ ఈ సినిమా రిలీజైంది. అయితే పూర్తిస్థాయిలో ఒక బాలీవుడ్ మూవీకి అనిరుధ్ ట్యూన్స్ క‌ట్ట‌నుండ‌డం ఇదే తొలిసారి. త్వ‌ర‌లోనే అనిరుధ్ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.