రెండో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్
బాలీవుడ్ స్టార్ యాక్టర్-డైరెక్టర్ ఫరాన్ అఖ్తర్, నటి-గాయని శిబానీ దండేకర్ శనివారం మహారాష్ట్రలోని ఖండాలాలో వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో సందడిగా జరిగిన ఈ వేడుకలో బ్లాక్ సూట్లో ఫరాన్, రెడ్ డ్రస్‌లో శిబానీ మెరిశారు. పెళ్లి ప్రమాణానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.