Read more!

English | Telugu

రేవ‌తి డైరెక్ష‌న్‌.. కాజోల్ యాక్టింగ్‌.. 'స‌లామ్ వెంకీ'!

 

రేవతి డైరెక్ష‌న్‌లో కాజోల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న 'స‌లామ్ వెంకీ' షూటింగ్ మొద‌లైంది. ముహూర్త‌పు షాట్‌కు సంబంధించిన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన కాజోల్‌, "ఈ రోజు మ‌నం చెప్పాల్సిన క‌థ‌, అనుస‌రించాల్సిన మార్గం, సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన జీవితానికి సంబంధించిన ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్నాం. న‌మ్మ‌శ‌క్యం కాని #స‌లామ్ వెంకీ నిజ జీవిత క‌థ‌ను మీతో పంచుకోవ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాం" అని రాసుకొచ్చింది.

'స‌లామ్ వెంకీ' అనేది అత్యంత‌ క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఒక త‌ల్లి చేసే పోరాట‌పు క‌థ‌. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా స్ఫూర్తిపొందిన క‌థ‌తో ఈ సినిమా త‌యార‌వుతోంది.

ఇదివ‌ర‌కు ఈ సినిమాకు 'ది లాస్ట్ హురా' అనే టైటిల్ పెట్టారు. దీని గురించి ఇదివ‌ర‌కు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో రేవ‌తి మాట్లాడుతూ, "ది లాస్ట్ హురాలో సుజాత జ‌ర్నీ నా హృద‌యానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.  ఇది కేవ‌లం ఇప్ప‌టి క‌థ మాత్ర‌మే కాదు ఇన్‌స్పైరింగ్ స్టోరీ కూడా. ఈ సినిమా గురించి సూర‌జ్‌, శ్ర‌ద్ధ‌, నేను మాట్లాడుకునేట‌ప్పుడు మా మ‌న‌సుల్లోకి వ‌చ్చిన మొద‌టి వ్య‌క్తి కాజోల్‌. ఆమె సున్నిత‌మైన‌, అదే స‌మ‌యంలో శ‌క్తిమంత‌మైన క‌ళ్లు, ఆమె అంద‌మైన న‌వ్వు ఏదైనా సాధ్య‌మేన‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తాయి. సుజాత పాత్ర స‌రిగ్గా అలాంటిదే. ఈ క‌ల‌యిక‌కు నేను చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను." అని చెప్పారు. 

'స‌లామ్ వెంకీ'ని బ్లైవ్ ప్రొడ‌క్ష‌న్స్‌, టేక్ 23 స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సూర‌జ్ సింగ్‌, శ్ర‌ద్ధ అగ‌ర్వాల్‌, వ‌ర్ష కుక్రేజా నిర్మిస్తున్నారు.