English | Telugu

Karthika Deepam2 :  కార్తీక్ దీపల శోభన ముహార్తానికి రంగం.. జ్యోత్స్న ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -193 లో.. దాస్ ఇంటికి పారిజాతం వస్తుంది. అక్కడున్న కాశీ, స్వప్నలతో దీప, కార్తీక్ ల పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంది. జనాలకి చెప్పుకోరు. ఇంట్లో కాపురం తప్ప.. బయట ప్రపంచానికి వాళ్ళు భార్యాభర్తలని చెప్పుకోరని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంటే.. అలా ఏం కాదు.. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేస్తానని స్వప్న అంటుంది. కరెక్ట్ చెప్పావ్ వాళ్లకి రిసెప్షన్ చేస్తామని పారిజాతంతో స్వప్న, కాశీ ఛాలెంజ్ చేస్తారు.