English | Telugu

అలాంటి తొక్కలో కామెంట్స్ పట్టించుకోవక్కర్లేదు

జబర్దస్త్ లో కమెడియన్ వెంకీ మంకీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వెంకీ మంకీకి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఐతే వెంకీ ఒక వేల్యుబుల్ పాయింట్ ని రైజ్ చేసాడు. అదేంటంటే ఇప్పుడు స్కిట్స్ బాగాలేదు అని అందరూ కామెంట్స్ పెట్టేస్తారు. బాగానే ఉంది. కానీ ఆ కామెంట్స్ కూడా బూతులతో కలిపి పెడతారు. అప్పుడు ఎవరూ కూడా ఆ కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన పని లేదు. రీజనబుల్ గా ఒక పద్దతిగా స్కిట్ బాలేదు..కొంచెం మార్చుకోండి అని చెప్తే పట్టించుకోవాలి..కానీ ఇలాంటి వల్గర్ వాళ్ళు పెట్టె కామెంట్స్ అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తే మార్చుకోవడంలో ఎదో ఒకటో చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ పని అసలు వాళ్ళు సరిగా చేస్తున్నారా ? పని లేని వాడు, సెన్స్ లేని వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పెడతారు కాబట్టి అలాంటి వాటిని అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు.

Karthika Deepam2 : స్కెచ్ ఆర్ట్ చూపించి ఏడ్చేసిన శౌర్య..  రిసెప్షన్ ఓకే చెప్పిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -196 లో....సుమిత్ర కాంచన ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. మీపై కోపంగా ఉంది జ్యోత్స్నని మీ ఇంటికోడలిని చేసుకుంటానని మాట తీసుకోవడం మీ తప్పు.. ఇవ్వడం మీ అన్నయ్య తప్పు.. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు నా కూతురు బాధపడుతుందని కాంచన తో తన బాధ పంచుకుంటుంది సుమిత్ర. నేను నా కూతురు లాగా మాట్లాడలేను.. కార్తీక్, దీప లకి రాసి ఉంది.. అందుకే పెళ్లి జరిగిందిని సుమిత్ర అంటుంది. మీరు రేపు ఫంక్షన్ కి ఎలాగైనా రావాలి.. రానని మాత్రo చెప్పకండి వదిన ఎదరు చూస్తూ ఉంటానని అని కాంచన అంటుంది.

Karthika Deepam2 : ఎమోషనల్ అయిన సుమిత్ర.. రిసెప్షన్ కి దీప ఒప్పుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -195 లో.....కార్తీక్ నా భర్త.. వాళ్ళది అసలు పెళ్లే కాదని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా నా బావని నా సొంతం చేసుకుంటానని సుమిత్రకి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ప్లీజ్ అత్తయ్య నా కూతురిని వదిలెయ్యండి అని పారిజాతంతో చెప్తుంది సుమిత్ర. పెద్దవాళ్ళుగా చేసేది తప్పని చెప్పాలి కదా అంటుంది. మీరు చేసింది ఏంటని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దీప లోపలికి వెళ్తుంది. దీప ఎందుకు రిసెప్షన్ వద్దని అంటుందో నాకు అర్థమైందని అనసూయతో కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు.

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -246 లో.....రామలక్ష్మి అభి ఉన్నా ఫోటోని చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. అదే టైమ్ అనుకొని శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు రామలక్ష్మి పై నెగటివ్ గా సీతాకాంత్ కి చెప్తారు. భర్తకి చెప్పకుండా అలా రామలక్ష్మి అక్క తనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన అభిని కలవడం ఏంటో అని అంటారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని సీతాకాంత్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ అంటూ శ్రీలత అడుగుతుంది. అది మీకు చెప్పనవసరం లేదని రామలక్ష్మి అంటుంది.

Brahmamudi : భార్యతో ఉన్నట్టుగా పట్టపగలే ఊహల్లో భర్త! 

​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -560 లో.. ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు కలిసి అప్పు, కళ్యాణ్ లని దీపావళికి ఇంటికి పిలవడానికి వస్తారు. కళ్యాణ్ ని రమ్మని ధాన్యలక్ష్మి అనగానే.. ఆలోచిస్తా అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడికి వరకు వచ్చి పిలిస్తే అలా అంటావని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పు నా భార్య.. తనని పిలవకుండా నన్ను పిలిస్తే ఎలా వస్తానని కళ్యాణ్ అనగానే.. నాకు తెలుసు అందుకే కదా పిలవడానికి వచ్చానని ధాన్యలక్ష్మి అంటుంది. అవునురా ఇద్దరిని పిలుస్తుందని ప్రకాష్ అనగానే.. వస్తాం మావయ్య అని అప్పు చెప్తుంది.