English | Telugu

పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఈ దేశానికి వెన్నుముక

నటి మాధవి ఇటీవలి కాలంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుతూ జనాల్ని ఇన్స్పైర్ చేస్తోంది. అలాంటి మాధవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది. పిఠాపురంలో జరిగిన సమావేశంలో హోమ్ శాఖ మంత్రి అనితను ఉద్దేశించి బాగా పని చేయాలని చెప్పడం తనకు ఎంతో నచ్చిన అంశం అని చెప్పింది. ఆయన తలుచుకుంటే హోం శాఖ తీసుకోవడం పెద్ద లెక్క కాదు అని చెప్పారు. హోమ్ మినిస్టర్ ఇంకా బాగా పని చేయాలని, పోలీసులకు ఇంకా ఎక్కువగా పవర్స్ ఇవ్వాలి అని చెప్పడం మంచి విషయం అన్నారు. తన సొంత పార్టీని కూడా క్రిటిసైజ్ చేయడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశం అన్నారు.

Karthika Deepam2 : రిసెప్షన్ కోసం విశ్వప్రయత్నం.. నచ్చదంటూ దీప పంతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -194 లో.....దీపని రిసెప్షన్ కి ఎలా ఒప్పించాలని శౌర్య ఆలోచిస్తుంది. పక్కనే కాంచన అనసూయ ఇద్దరు ఉంటారు. శౌర్యకి చాక్లెట్ ఇస్తూ.. ఇప్పుడు ఆలోచన వచ్చిందా అంటూ కాంచన అడుగుతుంది. రెండు, మూడు చాక్లెట్ లు ఇవ్వగానే ఐడియా వచ్చిందంటూ దీప దగ్గరికి శౌర్యా వెళ్లి.. మా ఫ్రెండ్స్ అందరికి నాన్నని పరిచయం చేయాలి కదా అందుకే మీరు రిసెప్షన్ చేసుకోండి అని శౌర్య అంటుంది. దాంతో శౌర్యపై కోప్పడి పంపిస్తుంది దీప. అప్పుడు కాంచన అనసూయ ఇద్దరు వచ్చి అది అన్న దాంట్లో తప్పేముందని అంటారు.

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. కోడలికి అగ్నిపరీక్ష కానుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -245 లో... అభికి రామలక్ష్మి వార్నింగ్ ఇవ్వాలని వెళ్తుంది కానీ అభి మాత్రం తన ప్లాన్ ప్రకారం తనని ఫాలో అవుతూ వస్తుందని గెస్ చేస్తాడు. అలాగే రామలక్ష్మి వస్తుంది. ఇక అభి ఇంటిదగ్గరే డిటేక్టివ్ అభి కోసం వెయిట్ చేస్తుంటే అభి వస్తాడు.‌తన వెనకాలే రామలక్ష్మి వస్తుంది. ఎందుకు మళ్ళీ వచ్చావ్ కావాలని ఇదంతా చేస్తున్నావంటూ రామలక్ష్మి అభితో గొడవపడుతుంది కానీ దూరం నుండి వాళ్లు మాట్లాడుకోవడం డిటేక్టీవ్ చూస్తాడు.

Brahmamudi : కళ్యాణ్ గురించి అనామిక... దుగ్గిరాల కుటుంబం చూడనుందా!

​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -559 లో....ఎందుకు కళ్యాణ్ పై డాక్యుమెంటరీ తీస్తున్నావని అనామికని సామంత్ అడుగుతాడు. దుగ్గిరాల వారసుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాంతో ఇంట్లో వాళ్ళు గేంటెస్తే ఆటో నడిపి జీవనం కొనసాగిస్తున్నాడంటూ టీవీలో వచ్చేలా చేస్తే అప్పుడు వాళ్ళ పరువు పోతుందని అనామిక అంటుంది. నువ్వు వాళ్ళ కంపెనీకి నష్టం చేస్తాను అన్నావని సామంత్ అంటాడు. మనం ఒక సామ్రాజ్యo కావాలి అనుకుంటున్నాం.. అందుకు ఒక యుద్ధమే చెయ్యాలని అనామిక అంటుంది. అందులో నేను చావకుండా ఉంటే చాలని సామంత్ అనుకుంటాడు.