English | Telugu

Tiger 3: బుకింగ్స్ తక్కువే... మిస్ అవుతున్న సల్మాన్ ఇంపాక్ట్, షారుఖ్ ని దించాల్సిందే

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కి గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ ‘టైగర్’. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలతో ఇండియాలో స్పై సినిమాలకి మార్కెట్ పెంచాడు సల్మాన్ ఖాన్. టైగర్ గా సల్మాన్ చేసిన క్యారెక్టర్ కి సూపర్ క్రేజ్ ఉంది, జోయాగా కనిపించిన కత్రినా కైఫ్ కూడా యాక్షన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టైగర్ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా టైగర్ ౩ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 12న టైగర్ 3 సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టైగర్ కి విలన్ గా ఇమ్రాన్ హాష్మి దిగడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Sandeep Reddy Vanga: ఇదెక్కడి రివెంజ్ అన్నా... అంత పెద్ద సినిమాని ఎలా చూస్తారు?

సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసినప్పుడు తెలుగుకి మరో రామ్ గోపాల్ వర్మ వచ్చాడు అన్నారు. ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ని ఇచ్చాడు అంటూ సందీప్ రెడ్డి వంగని, ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ ని చేసారు. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో కిబిర్ సింగ్ గా రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ వాళ్లు మాత్రం కబీర్ సింగ్ సినిమా వయోలేంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ రివ్యూస్ సందీప్ ని బాగా హర్ట్ చేసినట్లు ఉన్నాయి, వయోలెంట్ సినిమా అన్నారు కదా అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తా అంటూ రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ సినిమా చేస్తున్నాడు.

బిగ్ సర్‌ప్రైజ్: దీపావ‌ళికి మోత మోగిపోవాల్సిందే!

ఈ డిసెంబ‌ర్ ఇంత‌కు మునుపులా ఉండ‌దు అని ఆ మ‌ధ్య ప్ర‌శాంత్ నీల్ భార్య పోస్ట్ చేసిన‌ప్పుడు అంద‌రూ వావ్ స‌లార్ ఎక్స్ పెక్టేష‌న్స్ మామూలుగా ఉండ‌వు అనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్ నుంచి కూడా సేమ్ డైలాగ్ వినిపిస్తోంది. కాక‌పోతే ఈ న‌వంబ‌ర్ మామూలుగా ఉండ‌దు అని అంటున్నారు నార్త్ జ‌నాలు. స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ 3. ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది. ఆదిత్య చోప్రా తెర‌కెక్కించిన సినిమా ఇది. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ 2012 నుంచి స్పై సినిమాల‌ను రూపొందిస్తోంది. స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్  న‌టించిన ఏక్‌థా టైగ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. దానికి సీక్వెల్‌గా టైగ‌ర్ జిందా హై 2017లో విడుద‌లైంది. ఈ జ‌ర్నీ 2019 వార్‌తోనూ, ఈ ఏడాది ప‌ఠాన్‌తోనూ కంటిన్యూ అయింది.

సల్మాన్ ధమ్కీ కేక..‘టైగర్ 3’ సరికొత్త ప్రోమో!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టైగర్ 3’. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు రీసెంట్‌గా రిలీజైన ‘లేకే ప్రభు కా నామ్’ సాంగ్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఆడియెన్స్‌కి అనుకోని సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది. ‘టైగర్ ఈజ్ బ్యాక్’ పేరుతో 50 సెకన్ల వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇందులో టైగర్ పాత్రలో నటిస్తోన్నసల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీలా శత్రువుల నుంచి దేశాన్ని నాశనం కాకుండా కాపాడటానికి పోరాటం చేస్తున్నారు. ఏకంగా తనపై ఛాలెంజ్ చేసిన విలన్‌కి సల్మాన్ ఇచ్చిన ధమ్కీ కేకగా ఉంది.