Read more!

English | Telugu

ఆమెకి తన భర్త అంటే అసూయ..గ్యాంగ్ తో కలిసి సినిమాని టాలెంట్ ని తొక్కేస్తుంది 

భారతీయ సినీ పరిశ్రమలో జరిగే అవకతవకలపై ఎలాంటి జంకు బొంకు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటంలో  కంగానారనౌత్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. తన ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే ఆమెకి అనవసరం బుల్లెట్ దిగిందా లేదా అనేదే  ముఖ్యం. తను ప్రశ్నించాలనుకున్న విషయాన్నీ ఎలాంటి వంకరలు తిప్పకుండా  సూటిగా చెప్పడం ఆమె స్టైల్.  తాజాగా ఆమె మరోసారి  తన ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఇటీవల లో బడ్జెక్టు తో తెరకెక్కి సంచలన విజయం సాధించిన చిత్రం 12th ఫెయిల్. తాజాగా ఆ మూవీ సక్సెస్ మీట్ జరిగింది.ఆ  సందర్భంగా  చిత్ర దర్శకుడు వినోద్ చోప్రా మాట్లాడుతు తన 12th ఫెయిల్ చిత్రాన్ని ఎవరు చూడరని అందుకని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యవద్దని  ఓటిటి లో రిలీజ్ చేయమని  నా భార్య అనుపమ చోప్రా   సజిషన్ ఇచ్చిందనే వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. అనుపమ  చాలా పెద్ద అసూయపరురాలు తన కంటే తెలివైన అమ్మాయిలు కనపడితే అసలు తట్టుకోలేదు  అలాంటి ఆమెకి భర్త మీద అసూయా రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది అనే సంచలన ఆరోపణలు చేసింది. అలాగే డైరెక్టర్ భార్య హోదాలో చాలా ఫంక్షన్స్ కి హాజరయ్యి అక్కడ టాలెంట్ తో పాటు మంచి సినిమాని తొక్కాలనుకునే గ్యాంగ్ తో జత కొట్టి తన వంతు ప్రయత్నాలు చేస్తుందని కంగనా ఒక పెద్ద బాంబే పేల్చింది.

 

అలాగే ఆమె  తన భర్త పేరుని  డబ్బుని  ఉపయోగించి ఒక వెబ్ సైట్ ని  కూడా నడుపుతుంటుందని కంగనా చెప్పింది. ఇప్పుడు కంగనా  మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.అలాగే ఆ వ్యాఖ్యల్ని చూసిన  వాళ్ళు కంగనా  డేరింగ్ ని మెచ్చుకుంటున్నారు. కంగనా ప్రస్తుతం ఇందిరా గాంధీ క్యారక్టర్ ని పోషిస్తు ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తుంది.