Read more!

English | Telugu

ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తున్న 'ది కేరళ స్టోరీ'

థియేటర్లలో విడుదలైన ఏకంగా తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. అయితే 'లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను' అన్నట్టుగా ఈ సినిమా ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోంది.

అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. 2023 మే 5న విడుదలై వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని తీసుకోవడానికి ఎందుకనో ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదు. దీని వెనుక కొందరి కుట్ర ఉందని అప్పట్లో దర్శకుడు సుదీప్తో సేన్ ఆరోపించాడు. అయితే ఎట్టకేలకు రీసెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టింది కేరళ స్టోరీ.

'ది కేరళ స్టోరీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 దక్కించుకుంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5 లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చినప్పటికీ.. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి వీకెండ్ లోనే 150 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో సత్తా చాటింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఓటీటీలో ఊహించని రికార్డులు సృష్టించే అవకాశముంది.