రేవతి డైరెక్షన్.. కాజోల్ యాక్టింగ్.. 'సలామ్ వెంకీ'!
రేవతి డైరెక్షన్లో కాజోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'సలామ్ వెంకీ' షూటింగ్ మొదలైంది. ముహూర్తపు షాట్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన కాజోల్, "ఈ రోజు మనం చెప్పాల్సిన కథ, అనుసరించాల్సిన మార్గం, సెలబ్రేట్ చేసుకోవాల్సిన జీవితానికి సంబంధించిన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. నమ్మశక్యం కాని #సలామ్ వెంకీ నిజ జీవిత కథను మీతో పంచుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం" అని రాసుకొచ్చింది.