Read more!

English | Telugu

'ది ఫ్యామిలీ మ్యాన్' త‌ర్వాత 'గ‌న్స్ అండ్ గులాబ్స్‌'!

 

తెలుగువాళ్ల‌యిన ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్ అండ్ డీకే హిందీ చిత్ర‌సీమ‌లో త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. ఓటీటీలో అడుగుపెట్టి 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో ఫేమ‌స్ అయ్యారు. ఆ సిరీస్ రెండో సీజ‌న్‌లో విల‌న్‌గా స‌మంత చేసిన ప‌ర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రాజ్ అండ్ డీకే మ‌రో కొత్త సిరీస్‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం 'గ‌న్స్ అండ్ గులాబ్స్' అనే కామెడీ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను రూపొందించ‌నున్నారు.

Also read: కీర్తి సురేష్ బాటలో రాశీ ఖన్నా.. సొంత యూట్యూబ్ ఛానల్!

లేటెస్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ప్ర‌కారం ఈ సిరీస్‌లో మ‌ల‌యాళం స్టార్ యాక్ట‌ర్ దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించ‌నున్నాడు. ఇది ఓటీటీలో అత‌ని ఫ‌స్ట్‌ వెంచ‌ర్ కానున్న‌ది. ఇదివ‌ర‌కే ఈ సిరీస్‌లో బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ రాజ్‌కుమార్ రావ్ న‌టించ‌డం ఖాయ‌మైంది. ఇప్పుడు దుల్క‌ర్ ఎంట్రీతో 'గ‌న్స్ అండ్ గులాబ్స్' మ‌రింత క్రేజీ ప్రాజెక్టు అయ్యింది. ఆద‌ర్శ్ గౌర‌వ్ మ‌రో కీల‌క పాత్ర‌ను చేయ‌నున్నాడు.

Also read: ఓటీటీలో రిలీజైతే క‌లెక్ష‌న్లు రావ‌నే అభిప్రాయాన్ని తుత్తునియ‌లు చేసిన 'పుష్ప‌'

"నేర‌ప్ర‌పంచం నేప‌థ్యంలో ప్రేమ‌, అమాయ‌క‌త్వం గురించి వ‌ర్ణించే క‌థ ఇది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ప్రేర‌ణ‌తో 1990ల నాటి రొమాన్స్‌కు క్రైమ్ థ్రిల్ల‌ర్‌తో మేళ‌వించి, అదే స‌మ‌యంలో త‌గినంత హ్యూమ‌ర్‌ను జోడించి ఈ సిరీస్‌ను తీస్తున్నాం" అని నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. రాజ్ అండ్ డీకే నిర్మించిన తెలుగు కామెడీ డ్రామా 'సినిమా బండి' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియ‌ర్ అయ్యి మంచి ఆద‌ర‌ణ పొందింది.