Read more!

English | Telugu

ఆలియా, అజయ్ దేవ్‌గణ్ 'ఆర్ఆర్ఆర్' కంటే ముందే వస్తున్నారు

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారికారికంగా ప్రకటించారు.

వాస్తవానికి 'గంగూబాయి కతియావాడి' జనవరి 6 న విడుదల కావాల్సి ఉంది. అయితే జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల ఉండటంతో గంగూబాయి ఫిబ్రవరి 18 కి వాయిదా పడింది. అయితే కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తో 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ సైతం సమ్మర్ కి పోస్టుపోన్ అయింది. మరోవైపు ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగూబాయి విడుదలపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీమ్. 'గంగూబాయి కతియావాడి' సినిమాని ఫిబ్రవరి 25 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిజేశారు మేకర్స్.

ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ 'ఆర్ఆర్ఆర్'లో నటించడం విశేషం. రామ్ చరణ్ కి జోడిగా ఆలియా నటించగా, కీలక పాత్రలో అజయ్ నటించాడు. మరి ఈ ఆర్ఆర్ఆర్ స్టార్స్ నటిస్తున్న గంగూబాయి ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.