English | Telugu

య‌ష్ - వేద‌ల మ‌ధ్య చిత్ర ప్రేమ ర‌గ‌డ‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఏడేళ్ల క్రితం వ‌చ్చిన హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `యోహే మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించగా కీల‌క పాత్ర‌ల్లో బేబీ మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, రాజా శ్రీ‌ధ‌ర్‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్, మీనాక్షి త‌ద‌త‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం.

య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ త‌న చెల్లెలిని మీ త‌మ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటున్నాన‌ని అంటాడు. ఇందుకు య‌ష్ నాకు కొంచెం టైమ్ కావాలి అంటాడు. అలాగే వ‌సంత్ ని కూడా క‌నుక్కుంటాన‌ని చెబుతాడు. దీంతో హ్యాపీగా ఫీలైన దామోద‌ర్ రావు బిజినెస్ లో య‌ష్ కు మ‌రింత అండ‌గా వుంటానంటాడు. దాంతో య‌ష్ ఎలాగైనా ఆనంద్ ని పెళ్లికి ఒప్పించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. క‌ట్ చేస్తే ...వేద మాత్రం వ‌సంత్ కు చిత్ర కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని య‌ష్ తో చెబుతుంది. అది ఎట్ట‌ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌ద‌ని య‌ష్ అంటే జ‌రిగేలా చేస్తాన‌ని వేద ఛాలెంజ్ చేస్తుంది.

ఇద్ద‌రి ప్రేమ‌ను మీ బిజినెస్ కోసం బ‌లిచేయ‌వ‌ద్దంటుంది. అయినా నువ్వెరు నాకు చెప్ప‌డానికి గెట్ ఔట్ అంటూ వేద‌పై అరుస్తాడు య‌ష్‌. ఆ త‌రువాత జ‌రిగిన విష‌యాన్ని వ‌సంత్ కు చెబుతాడు. అంతే కాకుండా దామోద‌ర్ రావు చెల్లెలిని క‌ల‌వ‌మంటాడు. ఆ త‌రువాత వేద త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రికి వెళ్లి ఓ బిజినెస్ ప‌ని మీద నా బిజినెస్ పార్ట్న‌ర్ చెల్లెలు ఇక్క‌డికి వ‌స్తోంద‌ని, అమెని కొన్ని రోజుల పాటు మీ ఇంట్లో వుండ‌నివ్వాల‌ని చెబుతాడు. ఇది గ‌మ‌నించిన వేద .. చిత్ర నువ్వు ఏ విష‌యంలో వెన‌క్కి త‌గ్గొద్ద‌ని నీ ప్రేమ‌కు నేనున్నాన‌ని చెబుతుంది. దీంతో వేద - య‌ష్ ల మ‌ధ్య చిత్ర ప్రేమ ర‌గ‌డని సృష్టిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.