English | Telugu

సలార్ కొత్త ట్రైలర్.. ఈ వయలెన్స్ కి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

సలార్ కొత్త ట్రైలర్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అప్పుడు ఇప్పుడు అంటూ పలుసార్లు ట్రైలర్ రిలీజ్ టైంని మార్చడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ అసహనాన్ని ఆనందంగా మార్చేలా సలార్ కొత్త ట్రైలర్ వచ్చేసింది. కాస్త ఆలస్యంగా వచ్చినా ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

సలార్ ట్రైలర్ ట్రైలర్ ను ఈరోజు(డిసెంబర్ 18) మధ్యాహ్నం 3:33 గంటలకు విడుదల చేశారు. "చిన్నపుడు నీకో కథ చెప్పవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా.. ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దు అనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు" అంటూ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమైంది. పర్షియన్ సామ్రాజ్యం లాంటి ఖాన్సార్ సామ్రాజ్యాన్ని ట్రైలర్ లో చూపించారు. ఇక్కడ సుల్తాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే, ఆ సుల్తాన్ నమ్మే ఒకే ఒక్కడు ప్రభాస్. లోపల ఒక యుద్ధాన్ని దాచుకొని, ప్రపంచానికి మాత్రం మెకానిక్ లా కనిపించే వ్యక్తిగా ప్రభాస్ కనిపించాడు. "ఖాన్సార్ ఎరుపెక్కాలి. మండే నిప్పుతోనైనా, వీళ్ళ రక్తంతోనైనా" అంటూ తన స్నేహితుడు కోసం ప్రభాస్ విద్వాంసాన్ని సృష్టించడం ట్రైలర్ లో చూడవచ్చు. కేజీఎఫ్ తరహాలో సలార్ లో వయలెన్స్ ఉంటుందని అందరూ భావించారు. కానీ తాజా ట్రైలర్ చూస్తుంటే కేజీఎఫ్ ని మించి ఎన్నో రెట్ల వయలెన్స్ ఉండబోతుందని అర్థమవుతోంది. ఇక "ఖాన్సార్ వల్ల చాలా కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది.. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం." అనే డైలాగ్ తో ట్రైలర్ ను ముగించిన తీరు అదిరిపోయింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.