'గేమ్ ఛేంజర్' గురించి కీలక అప్డేట్.. మెగా ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందే!
తమ అభిమాన హీరో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్స్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తారు. కానీ 'గేమ్ ఛేంజర్' సినిమా విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురవుతూనే ఉంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైంది ఈ సినిమా. షూట్ ఎంత పూర్తయిందో తెలీదు. ఒకటి రెండు పోస్టర్లు తప్ప, ఈ సినిమాకి సంబంధించి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ లేవు. అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే స్థాయి నుంచి, కనీసం వచ్చే ఏడాదైనా సినిమా విడుదలైతే చాలు అనుకునే స్థాయికి అభిమానులు వచ్చేశారు. అయితే ఇప్పుడసలు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావడం కూడా కష్టమే అనిపిస్తోంది.