English | Telugu
బికినీతో యోగా చేస్తున్న మహేష్, వెంకటేష్ ల నటి!
Updated : Dec 19, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోలుగా 2013 లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి తేజస్వి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ కంటెస్ట్ గా మంచి గుర్తింపుని పొందింది. ఆ షో లో ఉన్నంత సేపు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ లతో రచ్చ రచ్చ చేసి సంచలనం సృష్టించిన తేజస్వి తాజాగా ఒక పిక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇటీవలే ఒక బీచ్ కి వెళ్లిన తేజస్వి బికిని ధరించి యోగా చేసింది. రక రకాల భంగిమలతో యోగాని చేసిన తేజస్వి వాటిల్లో భాగంగా ఒక యోగా భంగిమని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అంతే ఆ పిక్ ని చూసిన వాళ్ళందరూ వామ్మో యోగాని ఇలా కూడా చేయవచ్చా అని అనుకుంటున్నారు. కొంత మంది అయితే తేజస్వి అంత చలిలో కూడా ఎలా చేసిందని అనుకుంటున్నారు. కుర్రకారు అయితే చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు.ఇప్పుడు ఆమె పిక్ కి సోషల్ మీడియాలో రికార్డు స్థాయి లైక్స్ వస్తున్నాయి..
తేజస్వి చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమిలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికపుడు తన హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తు ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆమె పూర్తి పేరు తేజస్వి మదివాడ.