English | Telugu

సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ హీరోయిన్లకు తప్పని పోటీ!

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. హీరోయిన్ల విషయంలో అది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్‌ అంటేనే గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పొచ్చు. అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లకు ఈ పోటీ తాకిడి ఎక్కువ. ఒకరిని మించి ఒకరు సినిమాలు చేయాలని, పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది. ఈ తరహా పోటీ పాతతరం నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పోటీనైనా తట్టుకొని స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇప్పుడా పోటీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ కొనసాగుతోంది. ఇప్పుడు హీరోయిన్లకు తమని తాము ప్రూవ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఇటీవలికాలంలో చాలా మంది హీరోయిన్లు తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌ని స్టార్ట్‌ చేశారు. మన్మథుడు చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించిన అన్షు.. మజాకా చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమెకు ఎలాంటి క్రెడిట్‌ దక్కలేదు. అలాగే ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన జెనీలియా జూనియర్‌ అనే సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ, ఎలాంటి ఉపయోగం జరగలేదు. ఇప్పుడా వరసలో కామ్న జెఠ్మలాని వచ్చి చేరింది. ప్రేమికులు చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కామ్న.. కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్ద స్థాయి విజయాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు కెర్యాంప్‌ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ని స్టార్ట్‌ చేసింది. ఈ సినిమా అక్టోబర్‌ 18న విడుదల కాబోతోంది. ఈ సినిమా చేయక ముందు కామ్న ఒక వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

ఒకప్పటి హీరోయిన్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఘన విజయాలు అందుకున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అన్షు, జెనీలియా తరహాలోనే మరో హీరోయిన్‌ లయ.. తమ్ముడు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేదు. మరో పక్క భూమిక, సదా, మీరా జాస్మిన్‌ వంటి హీరోయిన్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌కి సంబంధించిన పోటీలో ఉన్నారు. తల్లి, అక్క, వదిన వంటి పాత్రల కోసం ఇప్పటికే కొందరు సెటిల్డ్‌ ఆర్టిస్టులు ఉన్నారు. అయితే ఆ క్యారెక్టర్స్‌ని కూడా గ్లామర్‌గా చూపించాలనే తాపత్రయం దర్శకుల్లో కనిపిస్తోంది. అందుకే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసే హీరోయిన్లు లైన్‌లోకి వస్తున్నారు. దాంతో వారి మధ్య గట్టి పోటీ ఎదురవుతోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.